కరీమాబాద్, న్యూస్‌లైన్ :
ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉందని బీసీ సంక్షేమ శాఖా మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. ఆదివారం నగర ంలోని వరంగల్ ఫోర్ట్‌రోడ్ రోటరీ క్లబ్ భవన్‌లో ఖిలావరంగల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(పీఏసీఎస్) రెండో సర్వసభ్య సమావేశం సంఘ చైర్మన్ కేడల జనార్దన్ అధ్యక్షతన జరిగింది. ఈ సంద ర్భంగా రైతులకు *17లక్షల70 వేల పంట రుణాలను మొత్తం 70 మంది రైతులకు అందించారు. అదే విధంగా ఒక ట్రాక్టర్‌ను కూడా రైతుకు అందించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి సారయ్య మాట్లాడుతూ దేశానికి వెన్నుముక అయిన రైతుల సంక్షమానికి ప్రాజెక్ట్‌ల నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు.
రైతులకు పంట రుణాలు అందిస్తూ వారికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కలగకుండా చూస్తున్నట్లు చెప్పారు. ఖిలా వరంగల్ పీఏసీఎస్ భవన నిర్మాణానికి కృషి చేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మంద వినోద్‌కుమార్, వైస్ చైర్మన్ బొలుగొడ్డు సారయ్య, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఎం. దేవేందర్‌రెడ్డి, నాయకులు ఎంబాడి రవీందర్, కేడల పద్మ, పోశాల పద్మ, కర్ర కుమార్, హన్మంత్‌రావు, బస్వరాజు కుమార్, డెరైక్టర్లు, సభ్యులు పాల్గొన్నారు.
రైతులకు అండగా ప్రభుత్వం
Published Mon, Sep 16 2013 4:17 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement