హైదరాబాద్: దాదాపు రెండేళ్ల తరువాత ఆంధ్రప్రదేశ్‌లోని మున్సిపాలిటీలకు కేంద్ర నిధులు మంజూరయ్యాయి. 13వ ఆర్థిక సంఘం నుంచి రెండేళ్లకిందటే రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు నిధులు మంజూరైనప్పటికీ.. ఎన్నికలు జరగకపోవడంతో వాటిని నిలిపేసింది. ఇటీవల మున్సిపాలిటీలకు ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో తొలి విడతగా రూ.57 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులను ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు ఖర్చు చేయాల్సి ఉంది. అయితే ఒకేరోజు మున్సిపాలిటీల వారీగా ఆన్‌లైన్‌లో చెల్లింపులు జరిగితేనే తాము ఈ నిధులు మంజూరు చేస్తామని 13వ ఆర్థిక సంఘం నిబంధన విధించింది.
అయితే రాష్ట్ర అధికారులు ఆన్‌లైన్ చెల్లింపులకు ఐదురోజుల గడువు ఇవ్వాలని తాజాగా విజ్ఞప్తి చేశారు. వారి కోరికను మన్నిస్తూ.. ఐదురోజుల గడువిచ్చింది.