వల్లూరు, న్యూస్‌లైన్: పుణ్య క్షేత్రమైన పుష్పగిరిలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ గోదాదేవి కల్యాణోత్సవం మంగళవారం కనుల పండువగా జరిగింది. ఆలయ చైర్మన్ వెంకట సుబ్బారెడ్డి సమక్షంలో వేద పండితులు అఖిల్ దీక్షితులు, సుమంత్ దీక్షితుల ఆధ్వర్యంలో శ్రీ మహా విష్ణువు అంశ అయిన శ్రీ చెన్న కేశవునికి , శ్రీమహాలక్ష్మి అంశ అయిన గోదాదేవి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. మాంగల్య ధారణ కార్యక్రమాన్ని చూసిన భక్తులు పరవశించిపోయారు . స్వామి వారి తలంబ్రాల కార్యక్రమం ప్రత్యేకంగా నిలిచింది. స్వామివారి తలంబ్రాలను వేదపండితులు భక్తులకు ప్రసాదంగా పంచి పెట్టారు. ఈ సందర్భంగా కొండప్రాంతమంతా గోవిందనామ స్మరణతో మార్మోగింది. కాగా ఉదయం స్వామివారికి బిందె తీర్థ సేవను నిర్వహించారు. దనుర్మాస ప్రాతఃకాల పూజ నిర్వహించారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
కల్యాణోత్సవంలో మాజీ మేయర్
పుష్పగిరిలో జరిగిన గోదాదేవి కల్యాణంలో మాజీ మేయర్, వైఎస్‌ఆర్‌సీపీ కమలాపురం నియోజకవర్గ సమన్వయకర్త పీ రవీంద్రనాధరెడ్డి పాల్గొన్నారు.
ఆలయ కమిటీ చైర్మన్ వెంకట సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆయన వెంట వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర సేవాదళ్ అడ్‌హక్ కమిటీ సభ్యుడు ఇందిరెడ్డి శంకర్‌రెడ్డి, రైతు విభాగం జిల్లా కన్వీనర్ సంబటూరు ప్రసాద్‌రెడ్డి, పార్టీ నేతలు ఈవీ. మహేశ్వరరెడ్డి, డీఎల్ శ్రీనివాసులురెడ్డి,డీఎల్ మురళీధర్‌రెడ్డి, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త రాజోలు వీరారెడ్డి దంపతులు కూడా కల్యాణోత్సవంలో పాల్గొని పూజలు నిర్వహించారు.
కనుల పండువగా గోదాదేవి కల్యాణం
Published Thu, Jan 16 2014 2:39 AM | Last Updated on Sat, Sep 2 2017 2:38 AM
Advertisement