వైద్యంలో ప్రణాళికేతర మాయ | Healing magic in the plan | Sakshi
Sakshi News home page

వైద్యంలో ప్రణాళికేతర మాయ

Aug 21 2014 1:08 AM | Updated on Sep 2 2017 12:10 PM

వైద్య ఆరోగ్యశాఖపై బడ్జెట్‌లో ప్రభుత్వం అంకెల గారడీ చూపింది. గతంలో ఎన్నడూ లేనంతగా వివిధ రకాల పద్దులను ప్రణాళికేతర వ్యయంలో చూపించింది.

హైదరాబాద్: వైద్య ఆరోగ్యశాఖపై బడ్జెట్‌లో ప్రభుత్వం అంకెల గారడీ చూపింది. గతంలో ఎన్నడూ లేనంతగా వివిధ రకాల పద్దులను ప్రణాళికేతర వ్యయంలో చూపించింది. 2014-15 సంవత్సరానికి ప్రణాళికేతర వ్యయం కింద రూ.3347 కోట్లు చూపించగా, ప్రణాళికా వ్యయం కింద కేవలం రూ.1040 కోట్లు మాత్రమే చూపించారు. వైద్య ఆరోగ్యశాఖకు మొత్తం బడ్జెట్టు రూ.4387 కోట్లుగా చూపించారు. ప్రణాళికేతర వ్యయంలో 80 శాతం సిబ్బంది జీతభత్యాలు, అలవెన్సులకే ఉంటుంది. ఏదైనా అభివృద్ధి పథకాలు చేయాలంటే ప్రణాళికా వ్యయంలోనే చూపించాలి.

రాజీవ్ ఆరోగ్యశ్రీపై ఇదే వివక్ష

రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరుమార్చుతామని చెబుతున్న ప్రభుత్వం కేటాయింపుల్లోనూ మార్పులు చూపించారు. ఇప్పటివరకూ ఉమ్మడి రాష్ట్రంలో 27 లక్షల మందికి శస్త్రచికిత్సలకు ఉపయోగపడి, ఎంతోమందికి పునర్జన్మనిచ్చిన ఈ పథకాన్ని ప్రణాళికా వ్యయం నుంచి తీసేసి ప్రణాళికేతర వ్యయంలోకి తెచ్చి రూ.500 కోట్లు మాత్రమే కేటాయించారు.    
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement