విజయవాడ: విజయవాడ నగరంలోని పటమట పంట కాల్వ సమీపంలోని ఆక్రమణలను మున్సిపల్ ఉన్నతాధికారులు మంగళవారం సిబ్బంది సహాయంతో తొలగిస్తున్నారు. దాంతో స్థానికులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. చాలా ఏళ్లుగా ఇక్కడ నివసిస్తున్న తమను ఎలా ఖాళీ చేయించి పంపిస్తారని వారు ఉన్నతాధికారులను ప్రశ్నించారు.
అందులోభాగంగా మున్సిపల్ సిబ్బంది చర్యలను వారు అడ్డుకున్నారు. స్థానికంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి... పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.