
బిల్లు కోసం వస్తే...
ఇందిరమ్మ పథకంలో భాగంగా ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులు బిల్లుల కోసం కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
ఇందిరమ్మ పథకంలో భాగంగా ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులు బిల్లుల కోసం కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సోమవారం కర్నూలు జిల్లా కోసిగిలో బిల్లుల కోసం వచ్చిన లబ్ధిదారులను హౌసింగ్ అధికారులు నూతన భవనాన్ని శుభ్రం చేసే పనులకు పురమాయించారు. ఎక్కడ బిల్లులను అడ్డుకుంటారోనని లబ్ధిదారులు కార్యాలయంలో పేరుకుపోయిన సిమెంట్, దుమ్ము, ధూళిని తొలగించడంతో పాటు కార్యాలయం ముందున్న మట్టిని చదును చేశారు. ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు.. వారిచేతే పనులు చేయించుకోవడం చర్చనీయాంశమైంది.
- న్యూస్‌లైన్, కోసిగి