'చచ్చేంత వరకు వైఎస్‌ఆర్ సీపీలోనే ఉంటా' | I will always be with YSRCP, MlA Narayana swamy | Sakshi
Sakshi News home page

'చచ్చేంత వరకు వైఎస్‌ఆర్ సీపీలోనే ఉంటా'

Published Wed, May 28 2014 11:12 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM

'చచ్చేంత వరకు వైఎస్‌ఆర్ సీపీలోనే ఉంటా' - Sakshi

'చచ్చేంత వరకు వైఎస్‌ఆర్ సీపీలోనే ఉంటా'

తిరుపతి : ‘నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టి జగన్‌ మోహన్‌ రెడ్డి కాళ్లకు తొడిగినా నా రుణం తీరదు. నేను పదవుల కోసం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రాలేదు. వైఎస్‌ఆర్ కుటుంబానికి రుణం తీర్చుకోవడానికే వచ్చా. తాను చచ్చేంత వరకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే కొనసాగుతా’ అని వైఎస్‌ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామి అన్నారు.

నారాయణస్వామి వైఎస్‌ఆర్ సీపీని వీడనున్నారంటూ ఒక టీవీ చానల్ వార్తాకథనాన్ని ప్రసారం చేసిన నేపథ్యంలో ఆయనపై విధంగా స్పందించారు. తనది పదవుల కోసం పార్టీలు మారే నైజం కాదని నారాయణస్వామి స్పష్టం చేశారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావించి దివంగత నేత డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి కుల మత ప్రాంతాలకు, రాజకీయాలకు అతీతంగా పనిచేశారన్నారు.

రాష్ట్రానికి ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలు, బడుగు బలహీనవర్గాల సంక్షేమానికి చేసిన నిస్వార్థ సేవకు ఆ మహానేత కుటుంబానికి ఎంతచేసినా రుణం తీరదన్నారు. వైఎస్‌ఆర్ స్ఫూర్తితో వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు సేవ చేస్తానన్నారు. తాను ఎప్పటికీ వైఎస్‌ఆర్ సీపీలోనే ఉంటానన్నారు. ఒక టీవీ చానల్ పనిగట్టుకుని తనపై దుష్ర్పచారం సాగిస్తోందని వాటిని నమ్మవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement