సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే నారాయణస్వామి
పెనుమూరు: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రతో రాష్ట్రంలో టీడీపీ పతనం ఖాయమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గంగాధరనెల్లూరు ఎమ్మె ల్యే నారాయణస్వామి తెలిపారు. పెనుమూరు మండలం సాతంబాకం పంచాయతీ పెద్దరాజుపల్లెలో రాక్ స్టార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ మండల గౌరవాధ్యక్షుడు మహాసముద్రం నరసింహారెడ్డి సమక్షంలో ఆదివారం వైఎస్‌ఆర్ కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ చూసినా జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు బ్రహ్మ రథం పడుతున్నారని చెప్పారు. ఓటమి భయంతో చంద్రబాబునాయుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీచేసి 150 స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరహాలో ప్రతి నాయకుడు, కార్యకర్త ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. ముఖ్యంగా యువత పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహాసముద్రం దయాసాగర్‌రెడ్డి, నాయకులు బి.నరసింహారెడ్డి, కారేటి గోవిందరెడ్డి, దూది మోహన్, బండి కమలాకర్‌రెడ్డి, ఐరాల మురళీకుమార్‌రెడ్డి, బండి హేమసుందర్‌రెడ్డి, రావిళ్ల ఆంజినేయులునాయుడు, భూపతి నాయుడు, మనోహర్, దాము తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిక
పెద్దరాజుపల్లెకు చెందిన సీనియర్ టీడీపీ నేతలు కె.సుబ్రమణ్యంరెడ్డి, కె.నరసింహారెడ్డి, కె.తులసీరామరెడ్డి, ఇ. ప్రభాకర్‌రెడ్డి సహా వారి అనుచరులు 30 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పెద్దరాజుపల్లె రాక్ స్టార్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.సోమశేఖర్‌రెడ్డి, సభ్యులు 49 మంది టీడీపీ నుంచి వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీలో చేరారు. చిన్నమరెడ్డికండ్రిగ పంచాయతీ బండమీదవూరుకు చెందిన సీనియర్ టీడీపీ నేత కామసాని వెంకటరెడ్డి 20 మంది అనుచరులతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నంజరపల్లె ఆదిఆంధ్రవాడకు చెందిన మనోహర్ టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి వెళ్లారు. వీరిని ఎమ్మెల్యే కె.నారాయణస్వామి, వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. దయాసాగర్‌రెడ్డి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
Comments
Please login to add a commentAdd a comment