సాక్షి, హైదరాబాద్: ఏపీ శాసనసభలో ఓ ఇనుప రాడ్డు ఊడిపడడంతో కొద్దిపాటి కలకలం చోటుచేసుకుంది. మంగళవారం జీరో అవర్‌లో ఈ సంఘటన జరిగింది. ఉదయం 10.51 గంటల సమయంలో పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ మాట్లాడుతుండగా.. అధికారపక్ష సభ్యులు కూర్చున్న వైపు గోడపై నుంచి ఇనుప రాడ్ ఊడి కిందపడింది. దీంతో స్పీకర్ సీటుకు కుడివైపున్న సభ్యులందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏమి జరిగిందో అర్థం కాక అందరూ ఆవైపు ఈవైపు చూస్తున్న దశలో సభలోని సిబ్బంది హుటాహుటిన అక్కడికి వెళ్లి ఇనుపరాడ్‌ను తొలగించారు. ఎవరికీ ఎటువంటి హానీ జరగలేదు.