ఖమ్మం జిల్లా పాల్వంచలో పేపర్ పరిశ్రమ ఏర్పాటుకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన రాష్ట్ర వన్యప్రాణి బోర్డు సమావేశం సిఫార్సు చేసింది.
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లా పాల్వంచలో పేపర్ పరిశ్రమ ఏర్పాటుకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన రాష్ట్ర వన్యప్రాణి బోర్డు సమావేశం సిఫార్సు చేసింది. కిష్టాసాగర్ రిజర్వ్ ఫారెస్టు ప్రాంతంలో 300 హెక్టార్లలో ఐటీసీ కాగితపు పరిశ్రమ ఏర్పాటుకు భూమి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) చేసిన ప్రతిపాదనను సమావేశం ఆమోదించింది. కర్మాగారం ఏర్పాటు చేసే సంస్థ ప్రతి ఏటా రూ. 50 లక్షలు లేదా లాభాల్లో ఒక శాతం నిధులను ఇస్తుందని ఏపీఐఐసీ పేర్కొంది. ఈ ప్రతిపాదనను కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు పంపనున్నారు. అటవీశాఖ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శామ్యూల్, రాష్ట్ర వన్యప్రాణి బోర్డు సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.