
సాక్షి, అమరావతి : 108 సేవల విషయంలో జాప్యం జరిగితే చర్యలు తప్పవని వైదార్యోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్‌రెడ్డి హెచ్చరించారు. 108 సేవలపై సమీక్షలో భాగంగా మంగళవారం వీవీజీ సంస్థ ప్రతినిధులతో జవహర్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 108 కాల్ సెంటర్‌ను ఆయన పరిశీలించారు.108 వాహనాల్లో ప్రాథమిక చికిత్సకు కావాల్సిన పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
108 వాహనాల నిర్వహణకు కనీసం మూడు నెలల పాటు కావాల్సిన నిధులను సిద్ధంగా ఉంచుకోవాలని జవహర్‌రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వం వైపు నుంచి నిధుల జాప్యాన్ని నివారిస్తామని తెలిపారు.108 సేవలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న నిధుల విడుదలపై నివేదికను సిద్దం చేయాలన్నారు.