కేసీఆర్ ను ప్రజలు తరిమి కొడుతారు: మాజీ సీఎం కిరణ్
కేసీఆర్ ను ప్రజలు తరిమి కొడుతారు: మాజీ సీఎం కిరణ్
Published Fri, Apr 4 2014 7:46 PM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
గుంటూరు: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ పై సమైక్యాంధ్ర పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిప్పులు చెరిగారు. కరీంనగర్, నల్లగొండ జిల్లాలో కేసీఆర్ కు ప్రజా వ్యతిరేకత తప్పదని ఆయన అన్నారు. ఆ జిల్లాలో కేసీఆర్ తిరిగితే ప్రజలు తరిమి తరిమి కొడతారని కిరణ్ అన్నారు. ఒకవేళ అలా జరగకపోతే పేరు మార్చుకుంటానని కిరణ్ శపథం చేశారు.
ఇతర పార్టీల నేతలను తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటున్న చంద్రబాబును పాత సమాన్లు కొనుక్కునే వ్యక్తి అని అన్నారు. ఇతర పార్టీల నేతలను పార్టీలో చేర్చుకుని బలం ఎక్కువగా ఉందని విర్రవీగుతున్నాడని ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
Advertisement
Advertisement