ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న కరువు పరిస్థితులపై వాయిదా తీర్మానం ఇచ్చామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చెప్పారు.
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న కరువు పరిస్థితులపై వాయిదా తీర్మానం ఇచ్చామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చెప్పారు. కరువు పరిస్థితులు, రైతన్నలు దుస్థితిపై ప్రతిపక్షం సలహాలు సూచనలు తీసుకుని ముఖ్యమంత్రి ప్రధానికి నివేదిక ఇచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. కరువు పరిస్థితులపై తక్షణమే స్పందించాలన్నారు. రాష్ట్రంలో ఇంతకన్నా ముఖ్యమైన సమస్య మరొకటి లేదని ఆయన అన్నారు. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం ప్రకటన చేయాలని కోటంరెడ్డి డిమాండ్ చేశారు.
సకాలంలో వర్షాలు కురవక, విత్తనాలు మొలకెత్తక రైతులు ఆందోళనలో ఉన్నారన్నారు. ఓవైపు రుణాలు అందక, మరోవైపు ఉపాధి లేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. పనుల కోసం రైతులు వలసపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం ప్రతిష్టకు పోకుండా వైఎస్ఆర్ సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానంపై తక్షణమే చర్చించాలని పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. అయితే స్పీకర్ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరించారు.