కృష్ణా నది యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శి ఆర్.కె.గుప్తా శనివారం నుంచి కృష్ణా నది పరీవాహక ప్రాంతంలోని ప్రాజెక్టు పరిధిలో పర్యటించనున్నారు.
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నది యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శి ఆర్.కె.గుప్తా శనివారం నుంచి కృష్ణా నది పరీవాహక ప్రాంతంలోని ప్రాజెక్టు పరిధిలో పర్యటించనున్నారు. ఈ నెల 8న కృష్ణా బోర్డు మార్గదర్శకాల తయారీపై ఇరు రాష్ట్రాలతో ఉమ్మడిగా సమావేశం నిర్వహిస్తున్న దృష్ట్యా అంతకుముందుగానే రెండు రాష్ట్రాల ప్రాజెక్టుల పరిధుల్లో పర్యటించనున్నారు. శనివారం కృష్ణా డెల్టాలో పర్యటించిన అనంతరం శ్రీశైలం ఎడమ, కుడి గట్టు కాలువ, సాగర్ కుడి, ఎడమ కాలువల కింద సైతం పర్యటనలు జరిపి అక్కడి స్థితిగతులను అధ్యయనం చేయనున్నారు. శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల కింద ఉన్న నిర్ణీత ఆయకట్టు, వాస్తవ నీటి లభ్యత, వినియోగం తదితరాలను పరిశీలించనున్నారు.