భూములను లాక్కోవటమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళుతోంది.
ఆదాయాన్నే వదులుకున్న సర్కారు
రిజిస్ట్రేషన్ శాఖకు రోజుకు రూ.45 లక్షలు నష్టం
రిజిస్ట్రేషన్లపై అధికారులకే స్పష్టత లేని వైనం
అధికారులను నిలదీసిన ఎమ్మెల్యే ఆర్కే
అమరావతి : భూములను లాక్కోవటమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళుతోంది. ఆ భూముల కోసం నష్టం భరించటానికైనా తెగించింది. అందులో భాగంగానే రాజధాని ప్రాంతాల్లో క్రయవిక్రయాలను నిలిపివేసింది. దీంతో రోజుకు సుమారు రూ.45 లక్షలకుపైనే ప్రభుత్వాదాయానికి గండిపడుతోంది. ప్రభుత్వ తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నవ్యాంధ్ర నిర్మాణం కోసం ప్రభుత్వం మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల పరిధిలోని 29 గ్రామాల పరిధిలో రైతుల నుంచి భూములను సమీకరించిన విషయం తెలిసిందే. కొందరు మాత్రం కోర్టును ఆశ్రయించటంతో సుమారు 5,700 ఎకరాలు రైతుల వద్దే ఉన్నాయి. ఆ భూములపై కన్నేసిన పాలకులు రైతులను లొంగదీసుకునేందుకు ఏకంగా రిజిస్ట్రేషన్లనే నిలిపివేశారు. మంగళగిరి, తాడికొండ, అమరావతి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నేటి నుంచి క్రయవిక్రయాలను నిలిపివేసింది.
దీంతో శుక్రవారం రాజధాని ప్రాంత రైతులు రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద వేచి ఉండటం కనిపించింది. మంగళగిరి, తాడికొండ, అమరావతి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రోజుకు సుమారు 250 వరకు భూములకు సంబంధించి క్రయవిక్రయాలు నడిచేవని అధికారులు వెల్లడించారు. ఒక్కో రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి ప్రభుత్వానికి సుమారు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలకుపైనే ఆదాయం సమకూరేదని అధికారులు చెపుతున్నారు. ఈ లెక్కన గురువారం మధ్యాహ్నం నుంచి రిజిస్ట్రేషన్లు నిలిపివేయటంతో సుమారు రూ.65 లక్షల వరకు ప్రభుత్వ ఆదాయానికి గండిపడినట్లు అంచనా. ఇలాగే నెలరోజులు కొనసాగితే రూ.13.50 కోట్లు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు చెబుతున్నారు.
ఎన్‌వోసీ ఇవ్వని సీఆర్‌డీఏ అధికారులు
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇవ్వని రైతులకు ఎన్‌వోసీ అవసరం లేదు. అయితే వారిని కూడా ఎన్‌వోసీ తీసుకురమ్మని సీఆర్‌డీఏ అధికారులు చెప్పినట్లు తెలిసింది. ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇచ్చిన వారికి సైతం ఎన్‌వోసీ సర్టిఫికెట్లు ఇవ్వలేదని రైతులు చెపుతున్నారు. ఎన్‌వోసీల విషయంపై తమకు ఎటువంటి ఆదేశాలూ లేవని సీఆర్‌డీఏ అధికారులు తెలియజేయటంతో రైతులు వెనుదిరిగి రావటం కనిపించింది. ఈ విషయంపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) శుక్రవారం మంగళగిరి సబ్‌రిజిస్ట్రార్‌తో మాట్లాడారు. ఎన్‌వోసీలపై స్పష్టత ఇవ్వాలని అదేశించారు. దీంతో సబ్‌రిజిస్ట్రార్ అధికారులు ఉన్నతాధికారులతో సంప్రదించి ఎన్‌వోసీలకు సంబంధించిన నియమ నిబంధనలను తెప్పించటం గమనార్హం. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు సోమవారం ఎన్‌వోసీలు ఇస్తారా, లేదా