
‘కంపసముద్రాన్ని’ దత్తత తీసుకున్న మేకపాటి
* ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు
నెల్లూరు: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కంపసముద్రం గ్రామాన్ని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి దత్తత తీసుకున్నారు. గ్రామాలను అభివృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా ఒక్కో గ్రామాన్ని ఎంపీలు దత్తత తీసుకోవాలని ప్రధాని మోదీ సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన పథకాన్ని ప్రవేశపెట్టారు.
ఈ పథకంలో భాగంగానే కంపసముద్రం గ్రామాన్ని దత్తత తీసుకుని అన్ని విధాలా అభివృద్ధి చేయనున్నట్టు ఎంపీ మేకపాటి బుధవారం తెలిపారు. ప్రత్యేక నిధులతో ఈ గ్రామంలో మౌలిక వసతులతో పాటు అత్యాధునికి సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు చెప్పారు.