
సాక్షి, ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఏంపీ, టీడీపీ నేత మాగంటి బాబు అస్వస్థతకు గురయ్యారు. ఏలూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి ఆయనకు చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం ఉదయం చింతలపూడిలో టీడీపీ నిర్వహించిన సైకిల్ యాత్రలో ఎంపీ మాగంటి బాబు పాల్గొన్నారు. సైకిల్ యాత్ర పూర్తయ్యాక ఆయన ఇంటికి చేరుకున్నారు. కానీ ఎండలో సైకిల్ తొక్కడం వల్ల ఆయన అస్వస్థతకు లోనయ్యారని తెలుస్తోంది. కుటుంబసభ్యులు ఆయనను చికిత్స నిమిత్తం ఏలూరులోని ఆస్పత్రికి తరలించారు. మాగంటిని పరీక్షించిన వైద్యులు ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించినట్లు సమాచారం.