అధికార దాహం అవకాశ వాదానికి అర్రులు చాస్తోంది. మరోమారు కుమ్మక్కు కుట్రలు పెనవేసుకుంటున్నాయి. మున్సిపాల్టీలే వేదికగా మురికి రాజకీయం బీజం వేసుకుంటోంది.
జిల్లాలోని గుడివాడ, నూజివీడు మున్సిపాల్టీల్లో పదవులు దక్కించుకునేందుకు కాంగ్రెస్, టీడీపీలు మళ్లీ చట్టాపట్టాలేసుకుంటున్నాయి. ఐదు వార్డులిచ్చినా చాలంటూ గుడివాడలో టీడీపీతో కాంగ్రెస్ పార్టీ రాయబేరం సాగిస్తుంటే
నూజివీడు కాంగ్రెస్‌కు కరువైన అభ్యర్థులు
సర్పంచి ఎన్నికల సమయంలో ఎదురైన పరిస్థితే మున్సిపల్ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఎదురవుతోంది. పట్టణంలో మొత్తం 30వార్డులున్నప్పటికీ అందులో నాలుగోవంతు వార్డు పదవులకు పోటీ చేయడానికి అభ్యర్థులు దొరక్కపోవటంతో కాంగ్రెస్‌కు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. నూజివీడు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పాలడుగు వెంకట్రావు ఎమ్మెల్సీగా కొనసాగుతున్నప్పటికీ కాంగ్రెస్‌కు దిశానిర్దేశం చేసే నాయకుడే కరువయ్యాడు. దీంతో నలుగురైదుగురు మాజీ కౌన్సిలర్లు పొత్తులపై టీడీపీతో రాయబేరాలు నడుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిలో భాగంగా
గుడివాడలో ఐదు వార్డులిచ్చినా చాలు
ఐదు వార్డులిచ్చినా చాలు అన్ని చోట్ల మీకు మద్దతిస్తామంటూ గుడివాడ మునిసిపాల్టీల కాంగ్రెస్‌కు దేబిరించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి కాంగ్రెస్ ధీనస్థితి అద్దం పడుతోంది. ఎలాగో గెలవలేమనుకునే నిర్ణయానికి వచ్చిన కాంగ్రెస్ నాయకులు కనీసం ఐదు వార్డులనైనా దక్కించుకునేందుకు టీడీపీ నేతలతో మంత్రాంగం నెరపుతున్నారు. ఐదు వార్డుల్లో కాంగ్రెస్ వారికి మద్దతిస్తే మిగిలిన వార్డుల్లో టీడీపీకి దన్నుగా నిలుస్తామంటూ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఇలాంటి నీచ రాజకీయాలను గమనిస్తున్న స్థానికులు ఛీత్కరించుకుంటున్నారు.