రుణమాఫీపై బాబుకు సీపీఐ నేత నారాయణ హితవు
విజయవాడ, న్యూస్‌లైన్: ఎన్నికల సమయంలో రైతులకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు.. దానినుంచి వైదొలిగేందుకు కేసీఆర్‌లా దొంగదారులు వెతికితే చూస్తూ ఊరుకోబోమని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె.నారాయణ హెచ్చరించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రుణమాఫీ పథకాన్ని ఎటువంటి షరతులు లేకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు రూ.75వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేయాల్సిందేనన్నారు.