కేసీఆర్, బాబు.. దొందూ దొందే
ఇద్దరూ నిజాలు చెప్పరు
మోదీ కే బినెట్‌లో అవినీతి మంత్రులు
భూఆక్రమణదారులకు కేసీఆర్ అండ
కమ్యూనిస్టులు నిఖార్సరుున కార్యకర్తలు
సీపీఐ 20వ జిల్లా మహాసభలో పార్టీ జాతీయ సమితి సభ్యుడు నారాయణ
తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఇద్దరూ నిజాలు చెప్పరని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ ధ్వజమెత్తారు. వారు పిట్టకథలు, బుర్రకథలు, హరికథలు చెబుతారని మండిపడ్డారు. జనగామలో మంగళవారం
సీపీఐ 20వ జిల్లా మహాసభలు జరిగారుు. ఈ సందర్భంగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి
సురవరం సుధాకర్‌రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ మాట్లాడారు. - జనగామ
జనగామ : తెలంగాణ సీఎం కేసీఆర్.. ఏపీ సీఎం చంద్రబాబు దొందూ దొందేనని, గతంలో వీరిద్దరూ దోస్తులని, నిజాలు చెప్పరని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కే నారాయణ ధ్వ జమెత్తారు. వారు బుర్రకథలు.. పిట్టకథలు.. హరికథలు చెప్తున్నారని, ఇంకా ఎన్నాళ్లు ఈ కథలు వింటామని ఆయన మండిపడ్డారు. జనగామ ప్రెస్టన్ మైదానంలో సీపీఐ 20వ జిల్లా మహాసభలు పార్టీ జిల్లా కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన మంగళవారం ప్రారంభమయ్యూరుు. ఈ సభలకు పార్టీ జాతీ య ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ తెలంగాణ సాయు ధ పోరాట పురిటిగడ్డ జనగామలో రాష్ట్రం ఏర్పాటయ్యాక తొలి జిల్లా మహాసభలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. కమ్యూనిస్టులు నిఖార్సరుున కార్యకర్తలని అన్నారు. మిగతా పార్టీలకు చెందినవారు సంతలో గా లం వేసినట్లు ప్రలోభాలు పెట్టి కంప్యూటర్లలో సభ్యత్వ నమోదు చేసుకుంటారని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉంటే వారు ఉంటారని, లేకుంటే పోతారన్నారు.
అవినీతి మంత్రులను తొలగించాలి
ప్రధాని నరేంద్రమోదీ ముందుగా తన కేబినెట్‌లోని 16 మంది అవినీతి మంత్రులను తొలగించి స్వచ్ఛత పాటించాలని నారాయణ డిమాండ్ చేశారు. స్వచ్ఛభారత్ అంటే ఇంట్లో చెత్తని ఇంటి పక్కవాడి గోడ వద్ద వేయడం కాదని ఎద్దేవా చేశారు.
భూ ఆక్రమణలకు అండగా ఉంటారా..
సీఎం కేసీఆర్ భూఆక్రమణదారులకు అండగా నిలవడం సిగ్గు చేటన్నారు.వెయ్యి గజాలు ఆక్రమించుకున్న వారికి కూడా నిర్ధారిత రిజిస్ట్రేషన్ రుసుం చెల్లిస్తే రెగ్యులరైజ్ చేస్తామని అనడం దారుణమన్నారు. పట్టణ శివారులో ఠాకూర్ లక్ష్మణ్‌నాయక్ సుమారు 150ఎకరాలు ఆక్రమించుకున్నాడని, దానిని ప్రభుత్వం స్వాధీ నం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం స్పం దించకపోతే తామే జెండాలు పాతి పేదలకు పంచుతామని హెచ్చరించారు. కాగా మహాస భ సందర్భంగా జనగామ పట్టణం ఎరుపుమయమైంది. కార్యక్రమంలో సీపీఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి సిద్ధి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు టి.వెంక ట్రాములు, మాజీ ఎమ్మెల్యే సీహెచ్ రాజారెడ్డి, జిల్లా సహా య కార్యదర్శి టి. సత్యం,నియోజకవర్గ కార్యదర్శి బర్ల శ్రీరాములు, మంగళంపెల్లి జనార్దన్‌రెడ్డి, నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.