రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా టీడీపీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేయున్నున్నట్లు ఆ పార్టీ మాజీ మంత్రి తాళ్లపాక రమేష్‌రెడ్డి తెలిపారు.
నెల్లూరు(దర్గామిట్ట), న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా టీడీపీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేయున్నున్నట్లు ఆ పార్టీ మాజీ మంత్రి తాళ్లపాక రమేష్‌రెడ్డి తెలిపారు. మినీ బైపాస్‌లోని జిల్లా టీడీపీ కార్యాలయంలో బుధవారం నగర కమిటీ సమావేశం జరిగింది. ముందుగా సమైక్యాంధ్ర ఉద్యమంలో అశువులు బాసిన ఉపాధ్యాయుడు బీ శంకరయ్యయాదవ్‌కు నివాళులర్పించారు. రెండు నిమషాలు మౌనం పాటించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన రమేష్‌రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 20న టీడీపీ నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా నగరంలో భారీ బైకు ర్యాలీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మైపాడు గేట్ సెంటరు నుంచి కనకమహల్, వీఆర్‌సీ, పెద్దబజార్, చిన్నబజార్, సంతపేట మీదుగా నర్తకి సెంటర్ వరకు ర్యాలీ జరుగుతుందన్నారు. ర్యాలీలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర పాల్గొంటారని చెప్పారు.
కార్పొరేషన్‌లో ఎస్సీ, ఎస్టీ నిధులను దారిమళ్లించిన విషయంపై టీడీపీ ఉద్యమం చేపట్టనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ నాయుకులు కార్పొరేషన్‌ను దోచుకుతింటున్నారని ఆరోపించారు. సమావేశంలో మండవ రామయ్య, తిరుమలనాయుడు, మున్వర్, శేషయ్య, బాషా, మురళీమోహన్, ఉచ్చి భువనేశ్వరప్రసాద్, బాలాజీ, మహేంద్రరెడ్డి, రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.