హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డితో చర్చల అనంతరం సమ్మెపై నిర్ణయం తీసుకుంటామాని ఏపీ ఎన్జీవో నేతలు స్పష్టం చేశారు. మరికొద్దిసేపట్లో వారు ముఖ్యమంత్రితో భేటీ కానున్నారు. సీమాంధ్ర ఏపీ ఎన్జీవోల జేఏసీ నేతలు గురువారమిక్కడ సమావేశం అయ్యారు.
కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా రాష్ట్రాన్ని విభజించేందుకు సిద్ధమవుతుంటే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు చేతులెత్తేశారని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న గట్టి సంకల్పంతో పోరాడుతున్న ప్రజల్లో ఆ ధృడ సంకల్పం సడలకుండా ఉండాలంటే పోరాటం కొనసాగించాలని... అందుకే సమ్మెను కొనసాగించాలనే నిర్ణయించినట్లు ఏపీ ఎన్జీఓల సంఘం అధ్యక్షుడుఅశోక్‌బాబు తెలిపారు . ముఖ్యమంత్రితో జరిగే చర్చల్లో ఆయన ఇచ్చే హామీ ఆధారంగా తమ భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని ఆయన పేర్కొన్నారు.