బొబ్బిలి: గ్రామ దేవతకు పండుగకు కొడుకు వస్తున్నాడని ఆ తల్లిదండ్రులు సంబర పడిపోయారు. బయట ఊరిలో చదువుతూ ఇంటికి వస్తున్న కుమారుడి కోసం అన్ని ఏర్పాట్లూ చేశారు. కానీ అంతలోనే ఆ కుర్రాడు చనిపోయాడనే వార్త వినాల్సి రావడంతో వారు తల్లడిల్లిపోతున్నారు. ఒక్క రోజు ముందు రైల్వే స్టేషన్‌లో కలిసి మాట్లాడిన కొడుకు ఇక లేడని తెలిసి ఆ తండ్రి కంటికీ మింటికీ ఏకధారగా ఏడుస్తున్నారు. బొబ్బిలి రైల్వే స్టేషన్‌లో మంగళవారం ఉదయం బాడంగికి చెందిన మరడా న కిశోర్(17) అనే విద్యార్థి హఠియా-యశ్వంత్‌పూర్ రైలు నుంచి జారి పడి మృతి చెందాడు. పూర్తి వివరాల్లోకి వెళితే... కిశోర్ విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మెకానికల్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి పాపారావు, తల్లి లక్ష్మిలకు కిశోర్ ఒక్క డే కొడుకు. గతంలో వీరికి ఓ కుమార్తె పుట్టి మరణించడంతో కిశోర్‌ను అల్లారు ముద్దుగా పెంచుతున్నారు.
పాపారావు కుటుంబ పోషణ కోసం కొన్నాళ్ల కిందట చెన్నై వలస వెళ్లారు. ప్రస్తుతం బాడంగిలో పోలమ్మ గ్రామదేవత పండుగ జరుగుతోంది. ఈ పండుగ కోసం ఆయన ఇంటికి వస్తూ విజయవాడ రైల్వే స్టేషన్‌లో కిశోర్‌ను కలిశారు. పండుగకు ఇంటికి రావాలని కొడుకుకు చెప్పారు. తనకు పరీక్షలున్నాయని, రాలేనని చెప్పి కిశోర్ తండ్రిని రైలు ఎక్కించి వెళ్లిపోయాడు. దీంతో పాపారావు సోమవారం ఇంటికి చేరుకున్నాడు. ఆ తర్వాత కిశోర్ ఇంటికి ఫోన్ చేసి ఫ్రెండ్‌సతో కలిసి పండుగకు మంగళవారం ఇంటికి వస్తున్నానని చెప్పాడు. ఫ్రెండ్‌సతో కలిసి విజయవాడ నుంచి బొబ్బిలికి హఠియా నుంచి యశ్వం త్‌పూర్ వస్తున్న రైలు ఎక్కాడు. ఆ రైలుకు బొబ్బిలి రైల్వే స్టేషనులో హాల్ట్ లేదు.
పార్వతీపురంలో దిగి వెనక్కి రావాలి. అయితే బొబ్బిలి స్టేషన్‌లో ట్రైన్ కాస్త నెమ్మది కావడంతో కిశోర్ దిగడానికి ప్రయత్నించి జారిపడిపోయాడు. ప్రమాదం జరిగి గాయపడిన కాసేపటికే వి ద్యార్థి మృతి చెందాడు. ఈ వార్త తెలియగానే కిశోర్ తల్లిదండ్రులు నిశ్చేష్టులయ్యారు. రైలు నుంచి జారిపడి తీవ్రంగా గాయపడిన కిశోర్ తల్లిదండ్రులతో అప్పుడు కూడా ఫోన్‌లో మాట్లాడి తనకేమీ కాలేదని, ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకొని ఇంటికి వచ్చేస్తానని చెప్పాడు. కానీ ఆ కొద్ది సేపటికే ప్రాణాలు వదిలేశాడు. దీంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. పం డగకి రాను రాను అంటూ వచ్చి వెళ్లిపోయావా... అంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రైలు నుంచి జారిపడి విద్యార్థి దుర్మరణం
Published Wed, Mar 4 2015 1:59 AM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM
Advertisement
Advertisement