బిజెపి నేతల ప్రసంగాలలో కొరవడిన జాతీయత: బొత్స | No Nationalism in BJP leaders speech: Says Botsa Satyanarayana | Sakshi
Sakshi News home page

బిజెపి నేతల ప్రసంగాలలో కొరవడిన జాతీయత: బొత్స

Published Mon, Aug 12 2013 2:46 PM | Last Updated on Thu, Mar 28 2019 8:37 PM

బొత్స సత్యనారాయణ - Sakshi

బొత్స సత్యనారాయణ

హైదరాబాద్: బిజెపి నేతల ప్రసంగాలలో జాతీయత కొరవడిందని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ విమర్శించారు. నిన్న ఇక్కడ జరిగిన 'నవభారత యువభేరీ' బహిరంగ సభలో  బీజేపీ ప్రచార కమిటీ సారధి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగాన్ని ఆక్షేపించారు. బొత్స ఈరోజు ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ  సైన్యాన్ని కించపరచడమే జాతీయతా? అని ప్రశ్నించారు. భారత సైన్యం సామర్ధ్యాన్ని అవహేళన చేయడం తగదని సలహా ఇచ్చారు.

మోడీ పుట్టక ముందే గుజరాత్ అభివృద్ధి చెందిందని చెప్పారు. కాంగ్రెస్పై విమర్శలకే మోడీ పరిమితమయ్యారన్నారు. ప్రజా సమస్యలు, వాటి పరిష్కారం గురించి మోడీ మాట్లాడలేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement