ఇక టీఆర్ఎస్ అవసరం లేదు: రేవంత్రెడ్డి | No need of TRS in telangana, says Revanth reddy | Sakshi
Sakshi News home page

ఇక టీఆర్ఎస్ అవసరం లేదు: రేవంత్రెడ్డి

Published Mon, Feb 24 2014 5:12 PM | Last Updated on Fri, Mar 22 2019 2:59 PM

ఇక టీఆర్ఎస్ అవసరం లేదు: రేవంత్రెడ్డి - Sakshi

ఇక టీఆర్ఎస్ అవసరం లేదు: రేవంత్రెడ్డి

హైదరాబాద్: తెలంగాణలో ఇక టీఆర్ఎస్ అవసరం లేదని టీడీపీ నేత రేవంత్రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు. పాలమూరు ఎత్తిపోతలను జాతీయ ప్రాజెక్టు చేయమని కేంద్రాన్ని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. పాలమూరు వలసల గురించి ప్యాకేజీ ఎందుకు అడగలేదని నిలదీశారు.

బాబ్లీ ప్రాజెక్టు కడుతుంటే కేసీఆర్ ఎప్పుడైనా అడ్డుపడ్డారా అని నిలదీశారు. తెలంగాణ ప్రజలు స్మరించుకోవాల్సింది జయశంకర్ గాని, కేసీఆర్ను కాదన్నారు. సోనియాకు కలిసేందుకు తెలంగాణ ఉద్యమకారులను ఎందుకు తీసుకెళ్లలేదని కేసీఆర్ను రేవంత్రెడ్డి ప్రశ్నించారు. సోనియా, రాహుల్, దిగ్విజయ్ సింగ్లతో కేసీఆర్ ఏం చర్చించారో వెల్లడించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement