విజయవాడ : ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయమని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు స్పష్టం చేశారు. ఆయన శనివారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ఆర్టీసీని ప్రమాదాలు, నష్టాలు లేని సంస్థగా తీర్చిదిద్దుతామన్నారు. రిపబ్లిక్ డే రోజున 100 కొత్త బస్సులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదగా ప్రారంభిస్తామని శిద్దా తెలిపారు.
ఆర్టీసీ విభజన ప్రక్రియకు ఇంకా రెండు నెలల సమయం పడుతుందని శిద్దా రాఘవరావు తెలిపారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో రాష్ట్రానికి 700 కొత్త బస్సులు రానున్నాయని ఆయన ప్రకటించారు. ఇకపై రోడ్ల నాణ్యతను అధునాతన పరికరాలతో తనిఖీ చేయనున్నామని శిద్దా రాఘవరావు పేర్కొన్నారు.