పట్టిసీమ ప్రాజెక్టుపై మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీ నాయకుడు దేవినేని నెహ్రూకు లేదని అర్బన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బుద్ధా వెంకన్న అన్నారు.
విజయవాడ : పట్టిసీమ ప్రాజెక్టుపై మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీ నాయకుడు దేవినేని నెహ్రూకు లేదని అర్బన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బుద్ధా వెంకన్న అన్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాయలసీమ ప్రజల్ని పట్టించుకోలేదన్నారు.
పట్టిసీమ పేరుతో మళ్లీ ప్రాంతాలవారీగా చిచ్చు రేపేందుకు కాంగ్రెస్ నాయకులు యత్నిస్తున్నారని విమర్శించారు. సమావేశంలో ఉడా మాజీ చైర్మన్ తూమాటి ప్రేమనాథ్, టీడీపీ నేతలు కోగంటి రామారావు, బోయిన సుబ్రహ్మణ్యం, మామిళ్లపల్లి రామస్వామి పాల్గొన్నారు.