'తాత్కాలిక రాజధాని వెనుక మంత్రి హస్తం' | tdp leaders buy the plats in amaravathi, alleges devineni | Sakshi
Sakshi News home page

'తాత్కాలిక రాజధాని వెనుక మంత్రి హస్తం'

Published Tue, Feb 3 2015 8:20 PM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM

'తాత్కాలిక రాజధాని వెనుక మంత్రి హస్తం' - Sakshi

'తాత్కాలిక రాజధాని వెనుక మంత్రి హస్తం'

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తాత్కాలిక రాజధాని ఏర్పాటు వెనుక ఓ మంత్రి  హస్తం ఉందని మాజీ మంత్రి దేవినేని నెహ్రూ  సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ మంత్రి అమరావతి టౌన్ షిప్ చుట్టుపక్కల ప్రాంతాల్లో 60 ప్లాట్లు కొనుగోలు చేసిన కారణంగానే తాత్కాలిక రాజధాని అంశం తెరపైకి వచ్చిందని విమర్శించారు. వారు కొనుగోలు చేసిన ప్లాట్ల విలువ పెరగటానికే తాత్కాలిక రాజధానిని మంగళగిరిలో ఏర్పాటు చేస్తున్నారని నెహ్రూ తెలిపారు.

 

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ ఫిబ్రవరి 6 నుంచి కోటి సంతకాల స్వీకరణ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు ఆయన తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement