
11నుంచి వన్డే టికెట్ల విక్రయం
వైఎస్సార్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఈ నెల 14న భారత్- వెస్టిండీస్ జట్ల మధ్య జరగనున్న వన్డే క్రికెట్ మ్యాచ్‌కు ఈ నెల 11 నుంచి టికెట్లు విక్రయించనున్నారు.
- మీ- సేవా కేంద్రాల్లో అమ్మకాలు
- 14న భారత్- వెస్టిండీస్ మ్యాచ్ ఏర్పాట్లు
విశాఖపట్నం : వైఎస్సార్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఈ నెల 14న భారత్- వెస్టిండీస్ జట్ల మధ్య జరగనున్న వన్డే క్రికెట్ మ్యాచ్‌కు ఈ నెల 11 నుంచి టికెట్లు విక్రయించనున్నారు. భారత్- వెస్టిండీస్ సిరీస్‌లో భాగంగా మూడో వన్డే ఇక్కడ ఫ్లడ్‌లైట్ల వెలుతురులో జరగనున్న విషయం తెలిసిందే. మ్యాచ్ ఏర్పాట్లపై చర్చించేం దుకు టోర్నీ నిర్వాహక కమిటీ చైర్మన్ ఎం.టి.కృష్ణబాబు అధ్యక్షతన శనివారం స్థానిక హోటల్‌లో సమావేశం నిర్వహించారు. టోర్నీ నిర్వాహక సబ్ కమిటీల చైర్మన్‌లు ఈ సమావేశంలో పాల్గొన్ని ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం నిర్వాహక కమిటీ చైర్మన్ కృష్ణబాబు, ఏసీఏ అధ్యక్షుడు డి.వి.సుబ్బారావు, కార్యదర్శి గోకరాజు గంగరాజులు వైఎస్సార్ ఏసీపీ-వీడీసీఏ స్టేడియంలో విలేకరుల సమావేశంలో ఆ వివరాలు వెల్లడించారు.
11న ఉదయం 8 గంటల నుంచి..
వన్డే టికెట్లను మీ-సేవా కేంద్రాల ద్వారా ఈ నెల 11వ తేదీ ఉదయం ఎనిమిది గంటల నుంచి విక్రయించనున్నామని నిర్వాహక కమిటీ తెలిపింది. ఈ నెల 9న టికెట్లను జేసీకి అందించనున్నామని, రెవెన్యూ అధికారులు వాటిని కేంద్రాలకు పదో తేదీన పంపే ఏర్పాట్లు చేయనుందన్నారు.
టికెట్లు ఇలా..
మీ-సేవా కేంద్రాలతో పాటు స్టేడియంలోనూ ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేసి టికెట్లను విక్రయించనున్నారు. రూ.250 టికెట్లను కేవలం క్రికెట్ క్లబ్‌లకు మాత్రమే అందించనుండగా, రూ.400 టికెట్లతో పాటు వెయ్యి, పదిహేను వందలు, రెండు వేలు, ఐదు వేల రూపాయల టికెట్లను కౌంటర్లలో విక్రయించనున్నారు. ఆన్‌లైన్ ద్వారా టికెట్లు విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.