పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం బుధవారం నిర్వహించిన పాలిసెట్-2014 జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. కడప నగరంలోని 9 కేంద్రాల్లో 3,281 మంది అభ్యర్థులకు గాను 3,050 మంది పరీక్ష రాశారు. ప్రొద్దుటూరులో 11 కేంద్రాల్లో 3,004 మందికి గాను 2,875 మంది, రాజంపేటలో 3 కేంద్రాల్లో 458 మందికి గాను 429 మంది హాజరయ్యారు.
పరీక్షా సమయానికి గంట ముందుగానే విద్యార్థులను అనుమతించడంతో ఎక్కడా ఆలస్యంగా వచ్చిన కేసులు నమోదు కాలే దు. పరీక్ష ఉదయం 11 నుంచి 1 గంట వర కు సాగింది. పరీక్షాకేంద్రాలను అధికారు లు పర్యవేక్షించారు.