
కడతేరని విద్యుత్ కష్టాలు
జిల్లాలో విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయాలు కలుగుతున్నాయి. గురువారం అర్ధరాత్రి శ్రీకాకుళం పట్టణానికి విద్యుత్ సరఫరా కాగా ఇప్పటి వరకు పట్టణం అంతటికీ కాకుండా కొన్ని ప్రాంతాలకు
శ్రీకాకుళం:జిల్లాలో విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయాలు కలుగుతున్నాయి. గురువారం అర్ధరాత్రి శ్రీకాకుళం పట్టణానికి విద్యుత్ సరఫరా కాగా ఇప్పటి వరకు పట్టణం అంతటికీ కాకుండా కొన్ని ప్రాంతాలకు మాత్రమే విద్యుత్ సరఫరా అవుతోంది. ఆయా ప్రాంతాలకు కూడా తరచూ సరఫరా నిలిచిపోతోంది. మరమ్మతులు చేసి తిరిగి సరఫరా చేస్తున్నా ఫలితం ఉండడం లేదు. జిల్లాకు తక్కువగా విద్యుత్ సరఫరా అవుతున్నట్టు సమాచారం. జిల్లాకు 50 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఇస్తున్నారు. ఇందులో శ్రీకాకుళం పట్టణానికే 30 మెగావాట్లు సరిపోతోంది. శనివారం వరకు శ్రీకాకుళం పట్టణానికి మాత్రమే విద్యుత్ సరఫ రా ఉండడం వల్ల సమస్య తలెత్తలేదు. శనివారం మధ్యాహ్నం నుంచి అన్ని మున్సిపాలిటీలకు, కొన్ని మండల కేంద్రాలకు సరఫరా పునరుద్ధరించడంతో లోడ్ పెరిగి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ కారణంగా లోడ్‌రిలీఫ్ పేరిట శ్రీకాకుళం పట్టణానికి సాయంత్రం నుంచి సుమారు ఐదు గంటల పాటు సరఫరా నిలిపివేశారు.
ఎప్పటికి పునరుద్ధరిస్తారో కూడా అధికారులు చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే జిల్లాలోని పంచాయతీలన్నీ ఇప్పటికీ అంధకారంలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. విద్యుత్ సరఫరా అవుతున్న ప్రాంతాల్లో ఇన్వర్టర్లు చార్జ్ అవుతుండడం, మోటార్లు విపరీతంగా వినియోగిస్తుండడంతో కరెం ట్ కొరత ఏర్పడుతోంది. ఈ కారణం గా మరో రెండు, మూడు రోజులు గ్రామస్థాయికి కరెంట్ సరఫరా సాధ్యం కాకపోవచ్చని విద్యుత్‌శాఖలోని దిగువ స్థాయి సిబ్బందే అభిప్రాయపడుతున్నారు. అలాగే పట్టణంలో పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా నిరాటంకంగా చేయలేక పోవడానికి కారణం సిబ్బంది కొరత కారణమని తెలిసిం ది. మొత్తం మీద జిల్లా ప్రజలకు విద్యు త్ సమస్య ఇప్పట్లో తీరేటట్లు కన్పించడం లేదు. కాగా కొందరు ప్రజాప్రతినిధులు తమ ప్రాంతానికే ముందుగా సరఫరాను పునరుద్ధరించాలని తెస్తున్న ఒత్తిడి వల్ల మరమ్మతులపై దృష్టి సారించలేకపోతున్నట్టు ట్రాన్స్‌కో సిబ్బందే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు.