కొత్త కలెక్టర్‌కు సమస్యల స్వాగతం
⇒ రెవెన్యూ శాఖలో అధిక సమస్యలు
⇒ భూముల హద్దుల కోసం ఏళ్లతరబడి ఎదురుచుపులు
⇒ ఇసుక మాఫియాను అణచి వేస్తారా..
⇒ బదిలీల్లో టీడీపీ నాయకుల ఒత్తిళ్లను అధిగమిస్తారా..
⇒ నేడు బాధ్యతలు స్వీకరించనున్న కలెక్టర్ జానకి
నెల్లూరు(రెవెన్యూ) : జిల్లాకు 91వ కలెక్టర్‌గా జానకిఅమ్మాల్ సోమవారం బా ధ్యతలు స్వీకరించనున్నారు. ఆమెకు జి ల్లాలో అనేక సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ముఖ్యంగా రెవెన్యూ శాఖ సమస్యలకు నిలయంగా మారింది. తహశీల్దార్ కార్యాలయాలు దళారులకు అడ్డగా మారాయి. ప్రతి చిన్న విషయంలోను టీడీపీ నాయకులు అధికారులపై ఒత్తిళ్లు చేస్తున్నారు. కొత్త కలెక్టర్ టీడీపీ నాయకులకు అనుకూలంగా వ్యవహరి స్తారా.. ఎవరినీ పట్టించుకోకుండా ప నులు చేసుకుంటూపోతారో వేచిచూడా లి. జిల్లాలో ఎం.రవిచంద్ర నుంచి పని చేసిన కలెక్టర్లు తమ ప్రత్యేకతను చాటుకున్నారు. పేదల కోసం నూతన పథకాలకు శ్రీకారం చుట్టారు. ఎం.రవిచంద్ర పేద విద్యార్థుల కోసం పథకాన్ని అవలంబించారు.
కలెక్టర్ రాంగోపాల్ పిటిషన్ మానిటరింగ్ సిస్టమ్‌ను ప్రారంభించి గ్రీవెన్స్‌డే పై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థుల సమస్యలు స్వయంగా వారే అధికారులకు ఫిర్యాదు చేసేందుకు కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఆయన బది లీ అయిన తరువాత దానికి మంగళం పాడేశారు. తర్వాత వచ్చిన శ్రీధర్ సరస్వతినిధి, స్వీకారంను ప్రారంభించా రు. కలెక్టర్ ఎన్. శ్రీకాంత్ గ్రీవెన్స్ పరి ష్కారానికి సంబంధించి పరిష్కారం ప్రారంభించారు. పరిష్కారం సిస్టమ్‌ను త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు.
బదిలీపై వెళుతున్న కలెక్టర్ ఎప్పుడు ఫోన్‌లో అందుబాటులో ఉం డే వారు కాదు. కొత్తగా బాధ్యతలు స్వీ కరించినున్న కలెక్టర్ ఫోన్‌లో అందుబాటులో ఉండాలని ప్రజలు కోరుతున్నా రు. నూతన కలెక్టర్‌కు జిల్లాలో సమస్య లు స్వాగతం పలుకుతున్నాయి. వందలాది సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడేలా ఉన్నాయి. ముఖ్యంగా రెవె న్యూ శాఖకు సంబంధించి వందల భూ సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. 30 ఏళ్ల కిందట ప్రజలకు పంపిణీ చేసిన భూములకు ఇప్పటి వరకు హద్దులు చుపలేదంటే రెవెన్యూ అధికారుల పని తీరు ఎమిటో అర్థమవుతుంది. కలువా యి మండలం పర్లకొండలో 28 ఏళ్ల కిందట 28 మంది పేదలకు నివాస స్థ లాలు మంజూరు చేశారు.
నివాస స్థలాలకు చెందిన లభ్ధిదారులు 15 సంవత్సరాల నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నా వారికి పొజిషన్ చుపించలేదు. లబ్ధిదారులు వారి సమస్యను జా యింట్ కలెక్టర్ జి. రేఖారాణికి విన్నవించుకున్నారు. స్థలం సర్వే చేసి లబ్ధిదారులలో గ్రామంలో ఉన్నా వారికి పొ జిషన్ చూపించమని ఆదేశించారు. క లువాయి తహశీల్దార్ టీడీపీ నాయకు లు అడుగులకు మడుగులు ఒత్తుతూ వారి అర్హులుకాదు అని స్థలంలో ఇది ప్రభుత్వ భూమని బోర్డు పెట్టారు. పా త జాబితాలో ఉన్నా వారి పేర్లను తొల గించి టీడీపీ నాయకులు సూచించిన వారికి పట్టాలు ఇచ్చేందుకు ప్రయత్నా లు చేస్తున్నారు. జేసీ ఆదేశించినా పట్టించుకోకుండా టీడీపీ నాయకులు సలహామేరకు పనిచేసే తహశీల్దార్లు జి ల్లాలో అనేక మంది ఉన్నారు.
తహశీ ల్దార్ల బదిలీలలో టీడీపీ నాయకులు పట్టుబట్టి తమకు అనుకూలంగా ఉండే వారిని ప్రాంతాలకు బదిలీలు చేయిం చుకున్నారు. గిరిజనులకు ఇచ్చిన వందలాది ఎకరాల భూమలు భూస్వామలు అక్రమించుకుని అనుభవిస్తున్నారు. భూ విలువలు అధికంగా పెరిగిపోవడంతో పట్టా భూములే కాకుండా వందలాది ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురిఅయిఉన్నాయి. కావలి తదితర ప్రాంతాల్లో చెరువులు ఆక్రమించుకుని లేఅవుట్లు వేశారు. ఈ విషయాలు స్థానిక అధికారులకు తెలిసినా పట్టించుకోవడంలేదనే విమర్శలున్నాయి.
జిల్లాలో జాక్‌పాట్ లారీలు, ఇసుక మా ఫియా పాతుకుపోయింది. వాటి జోలికి వెళ్లిన అధికారులు భంగపడ్డారేకాని వా టిని అరికట్టడంలో విఫలమయ్యారు. జాక్‌పాట్ లారీలు, ఇసుక మాఫియా జోలికి వెళితే పై స్థాయి నుంచి ఫోన్‌లు వస్తున్నాయి. వేలాది మంది అర్హులైన వారి పింఛన్లు తొలగించారు. వాటిని పునరుద్ధరించాలని బాధితులు కోరుకుంటున్నారు. గ్రీవెన్స్ డేకు సంబంధించి వేలాది సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రజలు సమస్యల పరి ష్కా రం కోసం నెలల తరబడి కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు.
ఇరిగేషన్‌కు సంబంధించి పనులు చేయకుండానే బిల్లులు కాజేస్తున్నరనే ఆరోపణలున్నా యి. జలయజ్ఞంలో భారీస్థాయిలో అవి నీతి చోటుచేసుకుందని విమర్శలున్నా యి. జలయజ్ఞం పనులు నత్తనడకన సాగుతున్నాయి. కాలువలకు పూడిక తీయకుండా సాగునీరు విడదుల చేయడంతో చివరి భూములకు నీరు పారడంలేదు. రెవెన్యూ శాఖలో జరిగిన బది లీలు గందరగోళంగా ఉన్నాయి. ఎవరు ఎప్పుడు ఎక్కడకు బదిలీలు చేస్తారో అర్థంకాని స్థితిలో ఉద్యోగులున్నారు. కొత్త కలెక్టర్ అయినా తమకు మెరుగైన సేవలు అందించాలని ప్రజలు కోరుకుంటున్నారు.