పోలీసుల చిత్ర హింసల వల్లే తమ కుమారుడు మృతి చెందాడంటూ నెల్లూరు జిల్లా డక్కిలిలో ప్రధాన రహదారిపై మృతదేహంతో కుటుంబ సభ్యులు ఆదివారం సాయంత్రం ధర్నాకు దిగారు. ఎర్రచందనం స్మగ్లర్ అయిన గానుగ శీనయ్య (40)ను పోలీసులు వారం రోజుల క్రితం అదుపులోకి తీసుకోగా, నెల్లూరు సబ్ జైలులో శనివారం మృతి చెందాడు.
అయితే, వారం రోజులుగా పోలీసులు చిత్ర హింసలు పెట్టడంతో శీనయ్య మృతి చెందాడని అతని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రజా సంఘాలతో కలసి తమకు న్యాయం చేయాలని కోరుతూ వారు శీనయ్య మృతదేహంతో వెంకటగిరి-రాపూర్ ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు.