అవకాశం ఉన్నప్పుడల్లా ప్రధాన ప్రతిపక్షంపై ఆరోపణలు గుప్పిస్తున్న అధికార పక్షం.. ...ప్రశ్నోత్తరాల్లోనూ అదే పంథాలో వెళ్ళింది.
హైదరాబాద్ : అవకాశం ఉన్నప్పుడల్లా ప్రధాన ప్రతిపక్షంపై ఆరోపణలు గుప్పిస్తున్న అధికార పక్షం.. ప్రశ్నోత్తరాల్లోనూ అదే పంథాలో వెళ్ళింది. ఎస్సీ కార్పోరేషన్‌పై సమాధానం చెప్పిన మంత్రి రావెల కిషోర్‌బాబు బుధవారం సభలో కార్పోరేషన్ పతనానికి గత ప్రభుత్వాలే కారణమంటూ ఆరోపించారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రతిపక్షం.. పదే పదే విషయాన్ని తప్పుదోవ పట్టించడం సరికాదని సూచించింది.
కాగా మరో ప్రశ్నకు సమాధానంగా 2018 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ పనుల పురోగతిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రశ్నకు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సమాధానమిచ్చారు. ఇప్పటి వరకూ ఆరు గ్రామాల్లో పునరావాసం కల్పించామని ప్రభుత్వం తెలిపింది. దీనిపై సభ్యులు మరింత వివరణ కోరారు.