
చంద్రబాబు నాయుడు ఏ సర్టిఫికెట్ ఇచ్చారు..
విశాఖ : శాసనసభ సమావేశాలు చూస్తుంటే సినిమాలకు ఇచ్చే సెన్సార్ సర్టిఫికెట్లా చంద్రబాబు నాయుడు 'A' సర్టిఫికెట్ ఇచ్చారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు అయిదేళ్ల పాలనను ప్రజలెవరూ చూడకుండానే వ్యవహరించారని ఆయన గురువారమిక్కడ అన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఏపీ అసెంబ్లీ వ్యక్తిగత దూషణలకే పరిమితమైందన్నారు. అసెంబ్లీలో తాము లేకపోవడం తమకు మంచే జరిగిందని ఆయన అన్నారు.