కడప అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : జిల్లాలో గత ఏడాది అక్టోబర్ నెలలో అధిక వర్షాలు పడటంతో పలు రకాల పంటలు దెబ్బతిన్నాయి. అధిక వర్షాలకు దెబ్బతిన్న పంటల వివరాల నివేదికను తయారుచేసి ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వం అందుకు స్పందించి 41 మండలాల్లో నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. దీనికి సంబంధించి గురువారం రాత్రి ప్రభుత్వం ప్రకటన జారీచేసింది.
జిల్లాలోని అట్లూరు, బి.కోడూరు, బద్వేలు, బి.మఠం, గోపవరం, కలసపాడు, రాజంపేట, నందలూరు, కాశినాయన, సిద్దవటం, ఒంటిమిట్ట, చాపాడు, దువ్వూరు, జమ్మలమడుగు, కొండాపురం, లింగాల, ముద్దనూరు, మైదుకూరు, మైలవరం, పెద్దముడియం, ప్రొద్దుటూరు, పులివెందుల, రాజుపాలెం, సింహాద్రిపురం, తొండూరు, వేంపల్లె, వేముల, చింతకొమ్మదిన్నె, చక్రాయపేట, చెన్నూరు, కడప, గాలివీడు, కమలాపురం, ఖాజీపేట, పెండ్లిమర్రి, వల్లూరు, వీరపునాయునిపల్లె, ఎర్రగుంట్ల, రామాపురం, సుండుపల్లె, చిన్నమండెం మండలాల్లో అధిక వర్షాలు కురవడంతో జొన్న, మినుము, పత్తి, పెసర, వేరుశనగ, సజ్జ, కొర్ర, వరి, పొద్దుతిరుగుడు, సోయాబీన్స్, కంది, మొక్కజొన్న, నువ్వులు, చెరకు పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు నివేదికలు పంపారు.
వాటి ఆధారంగా ప్రభుత్వం స్పందించి ఆయా మండలాలు అధిక వర్షాలకు గురై పంటలు దెబ్బతిన్నట్లు ప్రకటించారు. ఆయా మండలాల్లో రైతులు పంటల సాగుకోసం తీసుకున్న రుణాలను రీ షెడ్యూలు చేసేందుకు అంగీకారం తెలిపినట్లు సమాచారం.
అతివృష్టి మండలాల ప్రకటన
Published Fri, Jan 24 2014 2:31 AM | Last Updated on Sat, Sep 2 2017 2:55 AM
Advertisement
Advertisement