వంకాయలిస్తామని బాలికపై లైంగికదాడి
నిందితులపై నిర్భయ కేసు నమోదు
ఓజిలి : వంకాయలు ఇస్తామని బాలికను నమ్మించి తీసుకెళ్లి ఇద్దరు వ్యక్తులు గదిలో బంధించి లైంగిక దాడి చేశారు. ఈ ఘటన మండలంలోని కురుగొండలో ఆలస్యంగా వెలుగులోకి రావడంతో సంచలనం సృష్టించింది. పోలీసుల సమాచారం మేరకు.. కురుగొండకు చెందిన ప్రసాది శివ స్థానిక రైతు ముమ్మారెడ్డి ప్రభాకర్‌రెడ్డి తోటలో కాపలాదారుడిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో 12వ తేదీన మధ్యాహ్నం శివ కల్లుతాగి అన్నా వదిన అయిన ప్రసాది శ్రీనివాసులు, సిద్ధమ్మ దంపతుల ఇంటికి వెళ్లాడు.
ఏమి కూర చేశావని సిద్ధమ్మను అడిగారు. పచ్చడి చేశానని చెప్పడంతో పచ్చడితో ఏం భోజనం చేస్తాంలే.. పాపను పంపు తోటలో వంకాయలు ఉన్నాయని ఇచ్చి పంపుతామని చెప్పాడు. శివ వెళ్లిన కొద్ది సేపటికి సిద్ధమ్మ తన కూతురును తోట వద్దకు పంపింది. కల్లుతాగిన మైకంలో ఉన్న శివ తన తోటి స్నేహితుడైన శేఖర్‌కు ఫోన్ చేసి తోటలోకి పిలిపించాడు. బాలిక తోటలోకి వెళ్లగానే ఆ ఇద్దరూ ఆమెను గదిలోకి తీసుకెళ్లి లైంగికదాడి చేశారు.
ఆ బాలిక అరుపులు కేకలు వేసినా చుట్టు పక్కల ఎవరూ లేకపోవడంతో చివరికి కామాంధుల బారి నుంచి తప్పించుకుని ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లింది. జరిగిన విషయం తల్లిదండ్రులకు వివరించింది. బాలికపై లైంగికదాడికి పాల్పడిన శివ వరుసకు చిన్నాన కాగా, శేఖర్ సోదరుడు అవుతాడు. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులు సర్దుకున్నారు. ఏమైందో తెలియదు కానీ బుధవారం రాత్రి 11 గంటలకు స్థానిక పోలీసులకు బాలిక తల్లిద ండ్రులు ఫిర్యాదు చేశారు.
ఎస్సై సాంబశివరావు, ఏఎస్సై తిరుపాల్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని విచారించారు. ఈ విషయాన్ని సీఐ అక్కేశ్వర్‌రావుకు సమాచారం అందించారు. సీఐ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాలికను గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. కొన్ని శాంపిల్స్ సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపుతున్నట్లు వివరించారు. నిందితులిద్దరూ పరారీలో ఉన్నారు. నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చే సి దర్యాప్తు చే స్తున్నారు.