రోడ్ బ్లాకర్... టైర్ కిల్లర్
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్) బుధవారం సరికొత్త రక్షణ పరికరాలను రూపొందించింది.
ఈసీఐఎల్ ఆధ్వర్యంలో రక్షణ పరికరాల రూపకల్పన
హైదరాబాద్: ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్) బుధవారం సరికొత్త రక్షణ పరికరాలను రూపొందించింది. అనుమతి లేని ప్రాంతంలోకి వచ్చే వాహనాలను నిలువరించేందుకు ‘రోడ్ బ్లాకర్’, ‘టైర్ కిల్లర్’ పేరిట రూపొందించిన ఈ పరికరాలు ఉపయోగపడతాయని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.
బుధవారం సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ పి.సుధాకర్ వీటిని ప్రారంభించారు. ఏదైనా వాహనం అనుమతి లేకుండా దూసుకు వస్తే వాటి టైర్లను చీల్చేయడం, యాక్సిల్స్, సస్పెన్షన్ పనిచేయకుండా చేసి వాహనం అక్కడే నిలిచిపోయేలా చేస్తుంది ‘టైర్ కిల్లర్’. రోడ్డుపై వాహనాలు రాకుండా నిరోధించేందుకు ‘రోడ్ బ్లాకర్’ ఉపయోగపడుతుందన్నారు.