ఒంగోలు : మేదరమెట్ల మండలంలోని మేదరమెట్ల-తమ్మవరం జంక్షన్ జాతీయరహదారి పై ఆర్టీసీ సూపర్‌లగ్జరీ బస్సును లారీ ఢీ కొన్నసంఘటన శనివారం చోటుచేసుకుంది. వివరాలు...నెల్లూరు నుంచి విజయవాడకు 35 మంది ప్రయాణికులతో వెళుతున్న సూపర్‌లగ్జరీ బస్సును జాతీయరహదారి తమ్మవరం జంక్షన్ మలుపు నుంచి మేదరమెట్ల గ్రామంలోకి తిరిగేందుకు డ్రైవర్ బస్సును తిప్పాడు. అదే సమయంలో ఒంగోలు వైపుకు వెళ్తున్న సిమెంటు లారీ వేగంగా వచ్చి బస్సును ఢీ కొంది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న రాజారత్నం మేదరమెట్లలో దిగేందుకు బస్సు క్యాబిన్ వద్దకు రావడంతో రాజారత్నం తలకు త్రీవ గాయం అయ్యింది. క్షతగాత్రుడు తూర్పుగోదావరి జిల్లా రాజోలు గ్రామానికి చెందిన వ్యక్తి. క్షతగాత్రుని 108 వాహనంలో అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 35 మంది ప్రయాణీకులు ఉన్నారు. లారీ బస్సు మధ్యలో ఢీ కొని ఉంటే పెను ప్రమాదం సంభవించి ఉండేది. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. మేదరమెట్ల పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
(మేదరమెట్ల)
ఆర్టీసీ బస్సు, లారీ ఢీ...
Published Sat, Feb 28 2015 6:38 PM | Last Updated on Sat, Sep 2 2017 10:05 PM
Advertisement
Advertisement