'విభజన అనివార్యమని దమ్ముంటే ప్రజల్లోకి వెళ్లి చెప్పాలి' | Sailajanath dares Union ministers advocating bifurcation to explain its inevitability | Sakshi
Sakshi News home page

'విభజన అనివార్యమని దమ్ముంటే ప్రజల్లోకి వెళ్లి చెప్పాలి'

Published Wed, Oct 16 2013 2:40 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

'విభజన అనివార్యమని దమ్ముంటే ప్రజల్లోకి వెళ్లి చెప్పాలి' - Sakshi

'విభజన అనివార్యమని దమ్ముంటే ప్రజల్లోకి వెళ్లి చెప్పాలి'

రాష్ట్ర విభజన అనివార్యం అంటున్న సీమాంధ్ర కేంద్రమంత్రులు దమ్ముంటే ఆ విషయాన్ని ప్రజల్లోకి వెళ్లి చెప్పాలని రాష్ట్ర మంత్రి ఎస్.శైలజానాథ్ బుధవారం హైదరాబాద్లో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశంపై కేంద్రమంత్రుల్ని కలసే ఆలోచన సీమాంధ్ర కాంగ్రెస్ సమన్వయ కమిటీకి లేదని ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి పెంచేందుకు చేపట్టాల్సిన కార్యచరణపై చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. అందుకోసం రేపు మధ్యాహ్నం మినిస్టర్స్ క్వార్టర్స్లో సమావేశం ఏర్పాటు చేస్తున్నామని శైలజానాథ్ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement