రేపు ఢిల్లీలో సమైక్య ధర్నా: శైలజానాథ్ | Samaikya protests to be held at Delhi tomorro, says Sailajanath | Sakshi
Sakshi News home page

రేపు ఢిల్లీలో సమైక్య ధర్నా: శైలజానాథ్

Published Mon, Aug 12 2013 1:28 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM

రేపు ఢిల్లీలో సమైక్య ధర్నా: శైలజానాథ్ - Sakshi

రేపు ఢిల్లీలో సమైక్య ధర్నా: శైలజానాథ్

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనపై తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల వైఖరేమిటో సూటిగా చెప్పాలని రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి ఎస్.శైలజానాథ్ డిమాండ్ చేశారు. తాము మాత్రం మొదటి నుంచి సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నామని ఉద్ఘాటించారు. అందులో భాగంగా సీమాంధ్ర ప్రజల మనోభావాలను పార్టీ అధిష్టానం పెద్దలకు విన్పించేందుకు ఈనెల 13న సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులమంతా ఢిల్లీ వెళ్లి జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
 
  అసెంబ్లీ ఆవరణలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులంతా సోమవారం సాయంత్రానికి ఢిల్లీ చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. జంతర్‌మంతర్ వద్ద తలపెట్టిన కార్యక్రమానికి జాతీయ నాయకులు హాజరవుతారా లేదా? అనే సంగతి సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు చూసుకుంటారని వివరించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు విజన్ లేదని, అసలాయన రాజకీయ నాయకుడెలా అయ్యారో? ఇన్నాళ్లుగా ఎలా కొనసాగుతున్నారో? తమకు అర్థం కావడంలేదని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement