కరోనా ఎఫెక్ట్‌: మావీ ప్రాణాలే సారూ..! | Sanitation Workers Facing Problems Over Coronavirus Effect | Sakshi
Sakshi News home page

కరోనా ఎఫెక్ట్‌: మావీ ప్రాణాలే సారూ..!

Published Tue, Mar 24 2020 10:13 AM | Last Updated on Tue, Mar 24 2020 10:13 AM

Sanitation Workers Facing Problems Over Coronavirus Effect - Sakshi

ఒంగోలులో ఎటువంటి రక్షణ లేకుండా, దర్శిలో ఎటువంటి గ్లౌజ్‌లు, మాస్క్‌లు  లేకుండా పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు 

సాక్షి, ఒంగోలు: కరోనా..ఆ పేరు చెబితేనే ప్రజలు హడలిపోతున్నారు. ఎవరిలోనైనా కరోనా లక్షణాలు కనిపిస్తే ఆమడ దూరంలో ఉంటున్నారు. అటువైపు వెళ్లాలన్నా జంకుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఏ క్షణంలో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. అయితే ఇవేమీ పట్టించుకోని పారిశుద్ధ్య కారి్మకులు మాత్రం యధావిధిగా తమ రోజువారీ విధులకు హాజరవుతున్నారు. తాము పనిచేసే ప్రాంతాలు కరోనా ప్రభావితంగా అనుమానిస్తున్నప్పటికీ మా పని మేం చేసుకుంటూ వెళతామంటూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పారిశుద్ధ్య పనుల్లో నిమగ్నం అవుతున్నారు.

కరోనా వంటి ప్రాణాంతక వ్యాధులు వ్యాపించినా పారిశుద్ధ్య కారి్మకులు మాత్రం ఎలాంటి రక్షణ కవచాలు లేకుండా తమకు కేటాయించిన ప్రాంతాల్లో పనులు చేస్తున్నారు. వారిని చూసిన ప్రజలు ‘అయ్యో పాపం!’ అంటూ నిట్టూరుస్తుంటే సంబంధిత అధికారులకు మాత్రం చీమకుట్టినట్లు కూడా ఉండకపోవడం గమనార్హం. జిల్లా కేంద్రమైన ఒంగోలులోనే పారిశుద్ధ్య కారి్మకులకు కనీస రక్షణ కవచాలు లేకుండా పనిచేస్తున్నారంటే ఇక మిగిలిన ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో ఎలాంటి దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారో అర్థం చేసుకోవచ్చు.  

ఇవి తప్పనిసరి! 
పారిశుద్ధ్య కారి్మకులు విధులు నిర్వర్తించే సమయంలో మూడు రకాల రక్షణ కవచాలు తప్పనిసరిగా ధరించాల్సి ఉంది. చేతులకు గ్లౌజ్, మూతికి మాస్క్, కాళ్లకు షూస్‌ ఉండాలి. ఈ మూడు రక్షణ కవచాలను ధరించుకున్న తర్వాతనే పారిశుధ్య పనులు చేపట్టాలి. అయితే ఒంగోలు నగరంలో పనిచేసే పారిశుధ్య కార్మికులకే ఈ మూడింటిలో ఒక్క రక్షణ కవచం కూడా లేదు. ఇక మిగిలిన మునిసిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో పనిచేసే పారిశుధ్య కార్మికుల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో ఊహించవచ్చు.

ఆరోగ్యాన్ని, ప్రాణాలను ఫణంగా పెట్టి  కారి్మకులు పనిచేస్తున్నప్పటికీ అధికారులకు కనీసం జాలి కూడా కలగకపోవడం విచారకరం. జిల్లాలోని ఒంగోలు నగర పాలక సంస్థ, చీరాల, కందుకూరు, మార్కాపురం మునిసిపాలిటీలతోపాటు నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీల్లో వేలాది మంది పారిశుద్ధ్య కారి్మకులు పని చేస్తున్నారు. గతంలో పరి్మనెంట్‌ పారిశుధ్య కారి్మకులు ఉండటం, ఆ తర్వాత వారు ఉద్యోగ విరమణ చేస్తుండటం, కొత్తగా పరి్మనెంట్‌ కారి్మకులను తీసుకోకపోవడం, కాంట్రాక్టు పద్ధతిన తీసుకుంటుండటంతో వారికి కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదు. పరి్మనెంట్‌ పారిశుద్ధ్య కార్మికులకు నామమాత్రంగా వసతులు కలి్పంచేవారు. వారి స్థానాల్లో కాంట్రాక్టు పద్ధతిన వచ్చిన కారి్మకులను అధికారులు పూర్తిగా విస్మరిస్తున్నారు.  

సర్క్యులర్‌ సాధించుకున్నా? 
కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న పారిశుద్ధ్య కారి్మకులు విధులు నిర్వర్తించే సమయంలో కనీస రక్షణ కల్పించాల్సిన బాధ్యత సంబంధిత కమిషనర్లు, అధికారులపై ఉంది. అయితే వారు పారిశుద్ధ్య కారి్మకుల చేత పనులు చేయించుకోవడం తప్పితే రక్షణ బాధ్యత తమది కాదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒంగోలు నగరంలో పనిచేస్తున్న కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు కొన్నేళ్ల క్రితం మాస్‌్క, గ్లౌజ్, షూస్‌ కావాలంటూ పోరాడి సర్క్యులర్‌ కూడా ఇప్పించుకున్నారు. అయితే ఆ సమయంలో ఉన్న మునిసిపల్‌ కమిషనర్లు సౌకర్యాలు కల్పిస్తామంటూ చెప్పుకుంటూ  వచ్చారు. కానీ ఇంతవరకు  వారికి మాస్‌్క, గ్లౌజ్, షూస్‌ అనేవి లేకుండా పోయాయి.  

తమ తలరాత ఇంతే అన్నట్లుగా చేతులకు, కాళ్లకు, ముఖానికి ఏమీ పెట్టుకోకుండానే పారిశుద్ధ్య పనులు చేస్తున్నారు. సైడ్‌ కాల్వల్లో పేరుకుపోయిన చెత్తను కాళ్లకు కనీసం చెప్పులు కూడా లేకుండా, చేతులకు ఎలాంటి కవర్లు కూడా తగిలించుకోకుండా అలాగే తోడి బయటకు వేస్తున్నారు. నగరంలో ఏమైనా జంతువులు చనిపోతే చేతులకు ఎలాంటి రక్షణ గ్లౌజ్‌లు లేకుండా ఆ కళేబరాన్ని అలాగే పట్టుకొని ట్రాక్టర్లలో వేయడం నిత్యకృత్యమైంది. పారిశుద్ధ్య కారి్మకులు చేస్తున్న పనిని ప్రజలు చూసి జాలి పడుతుంటే, అధికారులకు ఆ మాత్రపు జాలి కూడా కలగడం లేదు. ఒంగోలు నగరంలో కరోనా కేసు నమోదైనందున ఇప్పటికైనా అధికారులు కరుణించి తమకు రక్షణ కవచాలు అందించాలని పారిశుద్ధ్య కారి్మకులు వేడుకుంటున్నారు.  

ఫేస్‌ మాస్క్‌లు సిద్ధం 
ఒంగోలు నగర పరిధిలోని పారిశుద్ధ్య కారి్మకులకు క్లాత్‌ ఫేస్‌ మాస్‌్కలు సిద్ధం చేసినట్లు నగర పాలక సంస్థ శానిటరీ సూపర్‌వైజర్‌ మోహన్‌రావు తెలిపారు. మొత్తం 786 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారని, వీరందరికీ మంగళవారం నుంచి వాటిని పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా షూస్, గ్లౌజ్‌లకు సంబంధించి కొటేషన్‌ ద్వారా వారికి అందిస్తామని చెప్పారు.   
– ఎస్‌ఎస్‌.మోహన్‌రావు,  ఒంగోలు కార్పొరేషన్‌ శానిటరీ సూపర్‌వైజర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement