క్రైం (కడప అర్బన్) : పులివెందుల ని వాసి కర్ణ సతీష్‌కుమార్‌రెడ్డి హత్య కేసు లో శుక్రవారం మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారిని చిన్నచౌకు పోలీసుస్టేషన్‌లో సాయంత్రం విలేకరుల సమావేశంలో హాజరు పరిచారు. ఈ సందర్భం గా డీఎస్పీ ఈజీ అశోక్‌కుమార్ మాట్లాడుతూ కర్ణ సతీష్‌కుమార్‌రెడ్డిని ఈనెల 13వ తేదీ కిడ్నాప్ చేసి టీడీపీ నేత బాలకృష్ణ యాదవ్ చెప్పిన మేరకు మా చుపల్లె బస్టాండులోని తమ కార్యాలయానికి తీసుకెళ్లి దాడి చేయడం, త ర్వాత అతన్ని చంపండంలో కీలకపాత్ర పోషించిన వారిలో డ్రైవర్ మురళీ యాదవ్, అనుచరుడు శేషసాయి అలియాస్ మణియాదవ్, మహబూబ్ రసూల్ అలియాస్ జిలానీలు ఉన్నారని పేర్కొన్నారు.
వారిని అరెస్టు చేశామన్నారు. మిగతా నిందితులైన టీడీపీ నేత బాలకృష్ణ యాదవ్, కిరాయి హంతకులు చంద్రశేఖర్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, బాబావలీల కోసం గాలిస్తున్నామన్నారు. బాలకృష్ణ యాదవ్ ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కేసు నమోదైన తర్వాత టీడీపీనేత బాలకృష్ణ యాదవ్‌ను ఎందుకు అరెస్టు చేయలేకపోయారని మీడియా బృందం అడిగిన ప్రశ్నకు డీఎస్పీ సమాధానమిస్తూ కేసు నమోదైన సమయానికి సంఘటనతో అతనికి సంబంధమున్నట్లుగా ప్రాథమిక నిర్దారణ కాలేదని చెప్పుకొచ్చారు. రాజకీయ ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా? అని అడుగగా ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని, అతని కోసం ప్రత్యేకంగా గాలిస్తున్నామని తెలిపారు.
సతీష్‌కుమార్‌రెడ్డి హత్య కేసులో మరో ముగ్గురు అరెస్ట్
Published Sat, Apr 25 2015 3:38 AM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM
Advertisement
Advertisement