గొర్రెల కాపరిపై దుండగుల దాడి | Shepherd attacked by thieves at karimnagar district | Sakshi
Sakshi News home page

గొర్రెల కాపరిపై దుండగుల దాడి

Published Tue, Sep 17 2013 8:47 AM | Last Updated on Tue, Aug 28 2018 7:30 PM

Shepherd attacked by thieves at karimnagar district

మల్హర్ మండలం శభాష్నగర్ కాలనీ సమీపంలోని అటవీ ప్రాంతంలో గొర్రెల కాపరులపై ఈ రోజు తెల్లవారుజామున దుండగులు దాడి చేశారు. ఆ దుండగుల దాడిలో ఐలయ్య అనే కాపరి మరణించాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం దుండగులు పరారయ్యారు. కాగా గాయపడిన కాపరులు బిగ్గరగా అరవడంతో సమీపంలోని ప్రజలు వెంటనే స్పందించి, పోలీసులకు సమాచారం అందించారు.

 

పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలపడంతో వారిని కరీంనగర్ జిల్లా ఆసుపత్రికి పంపించారు. అలాగే మృతి చెందిన ఐలయ్య మృతదేహన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement