కరోనా వైరస్‌: డ్రోన్‌ స్ప్రే | Sodium hypochloride Spraying At Corona Isolation centers In Vijayawada | Sakshi
Sakshi News home page

కరోనా.. హఠావో 

Published Wed, Apr 1 2020 8:54 AM | Last Updated on Wed, Apr 1 2020 9:22 AM

Sodium hypochloride Spraying At Corona Isolation centers In Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ: కరోనా వైరస్‌(కోవిడ్‌–19) విశ్వాన్ని వణికిస్తున్న మహమ్మారి. ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి శరవేగంగా వ్యాప్తి చెందే ఈ వైరస్‌ నిర్మూలనకు విజయవాడ నగరపాలక సంస్థ(వీఎంసీ) అధికారులు వినూత్న రీతిలో చర్యలు చేపట్టారు. వైరస్‌ ప్రభావం తీవ్రంగా ఉండటంతో ఇప్పటికే పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాల్లో మనుషులు వెళ్లకుండా డ్రోన్‌లతో వైరస్‌ను సంహరించే సోడియం హైపో క్లోరైడ్‌ ద్రావణాన్ని చల్లుతున్నారు. నగరంలో ఐదు డ్రోన్ల సాయంతో.. ఒక్కో డ్రోన్‌లో 5 లీటర్ల చొప్పున ఉదయం, సాయంత్రం వేళల్లో పిచికారీ చేస్తున్నారు. హైపో క్లోరైడ్‌ డిస్‌ఇన్ఫెక్షన్‌ వల్ల వైరస్‌ క్షణాల్లో చనిపోతుందని అధికారులు చెబుతున్నారు. పాజిటివ్‌ కేసులు నమోదైన కంటోన్మెంట్‌(కాలుష్య) జోన్లు, ఐసోలేషన్‌ కేంద్రాలతోపాటు నగరంలోని అన్ని ప్రధాన రహదారుల్లో ఈ విధంగా పిచికారీ చేస్తున్నామని అధికారులు ప్రకటించారు. (గల్లీల్లో 'ఢిల్లీ')

డ్రోన్‌  స్ప్రే ఎక్కడెక్కడ అంటే.. 
సిద్ధార్థ మెడికల్‌ కళాశాల రింగ్‌రోడ్డు, రమేష్‌ ఆస్పత్రి రింగ్‌రోడ్డు, విద్యాధరపురంలోని ఆర్టీసీ వర్క్‌షాప్, లబ్బీపేటలోని ఉషాకార్డియాక్‌ సెంటర్, రైల్వే ఆస్పత్రి, రైల్వే స్టేషన్‌ ప్రాంతాలు, రాజరాజేశ్వరీ పేటలోని వీఎంసీ మెటరి్నటీ ఆస్పత్రి, చెక్‌పోస్టు వద్దనున్న లిబర్టీ హాస్పిటల్‌ వద్ద డ్రోన్‌ల సాయంతో పిచికారీ చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement