రాళ్లు, రప్పలపైనే నడుచుకుంటూ.. గర్భిణి ప్రసవం | Srikakulam Tribal Area Womens Suffering With Transport System | Sakshi
Sakshi News home page

రాళ్లు, రప్పలపైనే కిలోమీటరు నడుచుకుంటూ..

Published Mon, Nov 12 2018 7:01 AM | Last Updated on Mon, Nov 12 2018 7:01 AM

Srikakulam Tribal Area Womens Suffering With Transport System - Sakshi

పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింత సవర కుమారితో సిబ్బంది

శ్రీకాకుళం, కాశీబుగ్గ: రాజకీయ నాయకులకు ఐదేళ్లకోమారు వచ్చే ఎన్నికల్లోనే గిరిజన గ్రామాలు గుర్తుకు రావడంతో ఇప్పటికీ సరైన రహదారికి నోచుకోవడంలేదు. ఫలితంగా అత్యవసర సమయంలో ఆస్పత్రికి చేరాలంటే గిరిజనుల అగచాట్లు వర్ణనాతీతంగా ఉన్నాయి. తాజాగా పలాస మండలం లొత్తూరు పంచాయతీ గిరిజన గ్రామం చిన్నపల్లియలో ఓ గిరిజన గర్భిణికి శనివారం అర్ధరాత్రి పురిటినొప్పులు రావడంతో 108 వాహనం వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.

చివరకు రాళ్లు, రప్పలపై కిలోమీటరు దూరం నడుచుకుంటూ ఈ వాహనం వద్దకు తీసుకొస్తుండగా స్ట్రెచర్‌పైనే ప్రసవించింది. గ్రామానికి చెందిన సవరకుమారి(23) రెండో కాన్పులో పండంటి పాపకు జన్మనిచ్చిందని ఈఎంటీ దేవాది శ్రీనివాసరావు తెలిపారు. గ్రామస్తులు సహకారంతో స్ట్రెచర్‌పై తీసుకొచ్చి 108 వాహనంలో తల్లీబిడ్డలను క్షేమంగా పలాస సామాజిక ఆసుపత్రిలో చేర్పించారు. ఈ సందర్భంగా ఈఎంటీతోపాటు పైలట్‌ టీ ఢిల్లేశ్వరరావు, అంగనవాడీ కార్యకర్త సవర నిర్మల సహాయ సహకారాలు అందించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement