సమైక్యాంధ్రను పరిరక్షిద్దాం.. సర్వతోముఖాభివృద్ధి సాధిద్దాం అంటూ జిల్లాలో సకల జనులు సమైక్య ఉద్యమంలో భాగస్వాములవుతున్నారు. గెలుపు పొందు వ రకు అలుపు లేదు మనకు అంటూ పోరుబాటలో దూసుకెళ్తున్నారు.ఉద్యోగులు తాత్కాలికంగా సమ్మె బాట వీడినా విద్యార్థులు, మిగిలిన వర్గాల వారు కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చే వరకు తాము విశ్రమించేది లేదని తెగేసి చెబుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో ఆందోళన
కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
సాక్షి, కడప : జిల్లాలో సమైక్య ఆందోళనలు మిన్నంటుతూనే ఉన్నాయి. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు పార్టీ కార్యకర్తలు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. నియోజకవర్గ కేంద్రాల్లో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ప్రజల్లో ఉద్యమస్ఫూర్తి నింపుతూ సమైక్య ఆందోళనలో వైఎస్సార్‌సీపీ తనదైన పాత్రను పోషిస్తోంది. ఉద్యోగులు సమ్మెబాట వీడి విధుల్లో చేరినా ఉద్యమం మాత్రం చల్లారలేదు. ప్రొద్దుటూరులో వేలాది మంది విద్యార్థులు ర్యాలీ చేపట్టి పుట్టపర్తి కూడలిలో సింహనాదం సభను నిర్వహించారు. పలుచోట్ల న్యాయవాదుల దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి.
వైఎస్సార్‌సీపీ ఆందోళనలు
ప్రొద్దుటూరులో రాజుపాలెం మండలం తొండలదిన్నె గ్రామానికి చెందిన గుద్దేటి రాజారామిరెడ్డి ఆధ్వర్యంలో 18 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ఈ దీక్షలు 60వ రోజుకు చేరుకోవడం విశేషం. వీరికి ప్రొద్దుటూరు నియోజకవర్గ సమన్వయకర్త రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, మండల కన్వీనర్లు నాగేంద్రారెడ్డి, నారాయణరెడ్డిలు సంఘీభావం తెలిపారు.
పులివెందులలో వైఎస్సార్‌సీపీ నేతలు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, బెల్లం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో రిక్షా ర్యాలీ నిర్వహించారు. పూల అంగళ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. చక్రాయపేట మండలానికి చెందిన 60 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు.
రాజంపేటలో నందలూరు మండలం ఆడపూరు పంచాయతీకి చెందిన వైఎస్సార్‌సీపీ నేత రమేష్‌నాయుడు, సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో 80 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి సంఘీభావం తెలిపారు.
రైల్వేకోడూరు మండలం ఓబన కొత్తపల్లె గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేతలు లక్కిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో 14మంది, శెట్టిగుంట ఆదాం సాహెబ్, అంబటి మురళి ఆధ్వర్యంలో 16మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు రోడ్డుపైన నిలబడి నిరసన తెలిపారు. వీరికి ఆ పార్టీ నేతలు సుకుమార్‌రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, సాయికిశోర్‌రెడ్డి సంఘీభావం తెలిపారు.
బద్వేలు నియోజకవర్గం కలసపాడు మండలం మహానందిపల్లె మాజీ సర్పంచు పురుషోత్తంరెడ్డి, సర్పంచ్ వేల్పుల వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో 20మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు డీసీ గోవిందరెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలు చిత్తా విజయప్రతాప్‌రెడ్డి, ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ రమణారెడ్డి, ఒ.ప్రభాకర్‌రెడ్డి సంఘీభావం తెలిపారు.
కమలాపురంలో వీఎన్‌పల్లె మండల కన్వీనర్ రఘునాథరెడ్డి, అలిదెన మాజీ సర్పంచ్ వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో 50మంది రిలే దీక్షల్లో కూర్చొన్నారు.
సమైక్య శంఖారావం సభను విజయవంతం చేయాలని నియోజకవర్గంలో ప్రచార రథం ద్వారా ప్రజలను చైతన్యవంతుల్ని చేశారు.
రాయచోటిలో రామాపురం మండలానికి చెందిన నల్లగుట్టపల్లె, సరస్వతిపల్లె, చిత్తూరు గ్రామాలకు చెందిన వైఎస్సార్‌సీపీ నేతలు మురళీధర్‌రెడ్డి, నాగభూషణ్‌రెడ్డి, వెంకటసుబ్బారెడ్డిల ఆధ్వర్యంలో 40మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీనివాసులురెడ్డి, జాఫర్ అలీఖాన్ సంఘీభావం తెలిపారు.
కడపలో 48వ వార్డుకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు రియాజుద్దీన్ ఆధ్వర్యంలో 20 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి నియోజకవర్గ సమన్వయకర్త అంజద్‌బాష, అఫ్జల్‌ఖాన్ సంఘీభావం తెలిపారు.
కడపలో న్యాయవాదుల, సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో దీక్షలు సాగాయి. ప్రొద్దుటూరులో ప్రైవేట్, మున్సిపల్ పాఠశాలల ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి పుట్టపర్తి సర్కిల్‌లో సింహనాదం సభను ఏర్పాటుచేశారు. ఈ సభ మున్సిపల్ కమిషనర్ వెంకట్రావు ఆధ్వర్యంలో కొనసాగింది.
రాజంపేటలో భాష్యం స్కూల్ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడ్డారు. బద్వేలులో బోడపాడు గ్రామస్తులు, జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మైదుకూరులో జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడ్డారు.
సమైక్యమే లక్ష్యం
Published Sun, Oct 20 2013 2:54 AM | Last Updated on Fri, Aug 17 2018 8:19 PM
Advertisement
Advertisement