
మృతుడు చరణ్
చిత్తూరు, పూతలపట్టు : రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్‌డెడ్ అయిన విద్యార్థి అవయవాలును వైద్యులు ప్రత్యేక వాహనంలో పలు ఆసుపత్రులకు తరలించా రు. తమిళనాడులోని తంజావూరుకు చెందిన విద్యార్థి చరణ్ నాలుగు రోజుల ముందు పూతలపట్టు మండలం ముత్తిరేవుల వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొన్న ప్రమాదంలో గాయపడిన విషయం విదితమే. అతనిని వేలూరు సీఎంసీకి తరలించారు. రెండు రోజుల పాటు చికిత్స చేసి వైద్యులు బ్రెయిన్ డెడ్ అయ్యాడని చెప్పిన సంగతి తెలిసింది.
ఈ విషయం తల్లిదండ్రులు శ్రీనివాసన్, సరితకు చెప్పారు. అవయవాలు దానం చేయాలని వైద్యులు కోరగా వారు అంగీకరించారు. వైద్యులు శనివారం రాత్రి అవయవాలు, లివర్‌ను సీఎంసీ వైద్యులు తీసుకోగా హార్ట్, లంగ్స్‌ను పోర్టిస్ మలయార్ సన్నితియా(చెన్నై), కిడ్నీలను ఎంఐఓటీ(చెన్నై), సిమ్స్(చెన్నై) ఆస్పత్రులకు ప్రత్యేక వాహనంలో తరలించారు.