ఆరోపణలు ఉన్నా...
► రెగ్యులర్ రిజిస్ట్రార్ గా శివశంకర్
► వీసీ కనుసన్నల్లోనే నియామకం
► ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యార్థి సంఘాలు
నెల్లూరు (టౌన్): వడ్డించేవాడు మనోడైతే బంతి చివర కూర్చొన్న అన్ని సమకూరతాయన్న చందంగా తయారైంది విక్రమ సింహపురి యూనివర్సిటీలో పరిస్థితి. ఇన్‌చార్జి రిజిస్ట్రార్ శివశంకర్‌పై అనేక అవినీతి ఆరోపణలు వెలువెత్తుతున్నా ఆయననే శాశ్వత రిజిస్ట్రారుగా నియమిస్తూ పాలకమండలి పచ్చజెండా ఊపింది. అధికార పార్టీ అండ కూడా తోడవ్వడంతో ఆయనకు ఎదురే లేకుండాపోయింది. రిజిస్ట్రార్ అంటే వర్సిటీలో గుమస్తా నుంచి ప్రొఫెసర్ల వరకు పొసగడం లేదు. పా లకమండలి నియామకంతోనైనా వర్సిటీ ప్రక్షాళన జరగుతుందని ఆశపడ్డ వారికి భంగపాటు తప్పడం లేదు. ఆక్కడ జరిగే పైరవీలకు వారు తలొగ్గారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈనెల 14న వీఎస్‌యూ రిజిస్ట్రార్‌గా శివశంకర్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో అవినీతి ఆరోపణలు ఉన్న వారిని రిజిస్ట్రార్‌గా నియమించి విద్యావ్యవస్థను అపహాస్యం చేస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఏది ఏమైనా రిజిస్ట్రార్ అవినీతిపై తమ ఉద్యమం ఆపేదిలేదని విద్యార్థి సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.
ఆరోపణలు ఎన్నో...
వర్సిటీ ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా శివశంకర్ హ యాం లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. గతంలో డిగ్రీ పరీక్షల మూల్యాంకనం విషయంలో వర్సిటీ ఉద్యోగులు, రిజిస్ట్రార్‌ల మధ్య వివాదం నెలకొంది. వారంరోజులుగా పైగా విధులు బహిష్కరించి ఆందోళనలు నిర్వహించారు. ఇరువర్గాలతో ఎమ్మెల్సీ సోమిరెడ్డి, ఎమ్మెల్యే శ్రీధరరెడ్డిలు సంప్రదింపులు జరిపారు. రిజిస్ట్రార్ అవినీతిపై విచారణ జరిపించాలని లేఖ రాస్తానని వీసీ ఒప్పుకోవడంతో ఉద్యోగుల చేత ఆందోళన విరమింప చేశారు. నేటికీ లేఖ రాయలేదు. డిగ్రీ పరీక్షల నిర్వహణలో అవకతవకలతో పాటు కార్పొరేట్ కళాశాలల దగ్గర భారీగా వసూళ్లకు పాల్పడి ర్యాంకులు ఇచ్చారని విద్యార్థి సం ఘాలు ఆరోపిస్తున్నాయి. అప్పట్లో హడావుడిగా విచారణ సంఘాన్ని ఏర్పాటు చేశారు.
కమిటీ నివేదిక ఇచ్చిన ప్రకారం రమణారెడ్డి, మురళీమోహన్, డిప్యూటీ రిజిస్ట్రార్‌లకు మెమోలు జారీచేశారు. రిజిస్ట్రార్ ఆదేశాలు ప్రకారం మాత్రమే చేశామని వారు చెప్పడంతో వెనక్కుతగ్గారు. డిగ్రీ మూల్యాంకనం విషయంలో రెండు కళాశాలలు అక్రమాలకు పాల్పడిట్లు ధ్రువీకరించారు. నేటికి వాటిపై చర్యలు లేవు. హాస్టల్ భోజ నం, క్రీడల నిధుల్లో రూ.40 లక్షల మేర రిజి స్ట్రార్ అవినీతికి పాల్పడ్డారంటూ విద్యార్థి సంఘాలు రోడ్డెక్కాయి.
రిజిస్ట్రార్‌కు అనుకూలంగా పాలకమండలి
రిజిస్ట్రార్ సొంతవారిని పాలకమండలిలో నియమించుకున్నారని విద్యార్థి నాయకులు ఆరోపిస్తున్నారు. పాలకమండలి సభ్యుడిగా నియమించా ల్సి వస్తుందని ప్రిన్సిపాల్ మురగయ్యను బదిలీ చేసి అనుకూలంగా ఉండే వెంకటరావును నియమించారన్న ఆరోపణలున్నాయి. రానున్నరోజు ల్లో పాలకమండలి అవినీతికి అండగా నిలుస్తుం దా లేక ప్రక్షాళన చేస్తుందాఅనేది వేచిచూడాల్సిందే.