తాళ్లపూడి (పశ్చిమ గోదావరి జిల్లా) : తాళ్లపూడి మండలం పెద్దేవం గ్రామంలో తాటిపాక రాజేష్(18) అనే యువకుడు అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. జెస్సీ అనే తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీరిద్దరూ కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నట్లు యువకుడి బంధువులు ఆరోపిస్తున్నారు. అమ్మాయి తరఫు బంధువులు గతంలో రాజేష్‌ను బెదిరించినట్లుగా తెలుస్తోంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.